Tirumala Laddu: తిరుమల లడ్డూ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. స్వతంత్ర దర్యాప్తు పై సుప్రీంకోర్టు నేడు నిర్ణయం తీసుకోనుంది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కె వి విశ్వనాథన్ ధర్మసనం విచారణ జరపనుంది. మ.3.30 గంటలకి విచారణ చేయనుంది.
సిట్ కొనసాగించాలా ? స్వతంత్ర దర్యాప్తు వేయాలా ? అనే అంశ పై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ను అభిప్రాయం చెప్పాలని సుప్రీం కోర్టు అడిగింది. గత విచారణలో సీఎం చంద్రబాబు వైఖరి పై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భగవంతుని రాజకీయాల్లోకి లాగొద్దని హితవు పలికింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా ఉండాలని స్పష్టం చేసింది.
జూలైలో రిపోర్టు వస్తే …సెప్టెంబర్ లో మీడియాకు ఎందుకు చెప్పారు ? అని నిలదీసింది. సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకోవాలని సూచించింది. కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు గాయపడ్డాయని ఈ సందర్భంగా ప్రస్తావించింది.
తిరస్కరించిన నెయ్యి లడ్డు తయారీలో వాడలేదని ఈవోనే స్వయంగా చెబుతున్నారు కదా ? అని కోర్టు ప్రశ్నించింది. కల్తీ నెయ్యి వాడినట్లు రుజువులు ఉన్నాయా ? సిట్ వేసిన తర్వాత మళ్లీ మీడియాకు ఎందుకు వెళ్తున్నారు.. అంటూ సుప్రీం ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Read also: Supreme court on Tirumala Laddu: సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Tirumala Laddu: కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరం
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ
Chandrababu Naidu: 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు
