AP TET: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాష్ట్రంలో రేపటి నుంచి జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించిన సెంటర్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉపాధ్యాయ ఉద్యోగార్థులు 4.27 లక్షల మంది టెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. రెండు సెషన్స్ లో టెట్ నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్ గా, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్ గా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నెల 21 వరకు ఏపీ టెట్ జరుగుతుంది.
మరోవైపు ఏపీలో మెగా డీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం 6,100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి కొత్తగా 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. టెట్ పరీక్షలు ముగియగానే డీఎస్సీ రిక్రూట్ మెంట్ ప్రక్రియ కొనసాగనుంది.
Read also: Telangana TET: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్.. ముఖ్య తేదీలు ఇవీ..
Telangana DSC Results: తెలంగాణ డీఎస్సీ ఫలితాల విడుదల
AP DSC New Schedule: ఏపీ డీఎస్సీ 2024 షెడ్యూల్‌లో మార్పులు.. మార్చి 20వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు
AP DSC Notification: ఏపీలో టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్.. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులంటే..
