YS Sharmila: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ షర్మిల డెడ్ లైన్ ఇచ్చారు. ఈ నెల 4 న మధ్యాహ్నం ఒంటి గంట లోపు తొలగించిన 4,200 మంది కాంట్రాక్టు కార్మికులను విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్లాంట్ ఆవరణలోనే తొలగించిన కార్మికులకు అండగా నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. విశాఖలో పర్యటించిన ఆమె.. మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఇవీ..
– 4 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడం అన్యాయం
– నాలుగు నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వలేదు
– నోటీసు ఇవ్వకుండా తొలగించడం దుర్మార్గం
– విశాఖ స్టీల్ ఆంధ్రులకు తలమానికం
– కాంగ్రెస్ హయంలో ప్లాంట్ లాభాల్లో ఉంది
– రాష్ట్రంలో,దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయే సరికి ప్లాంట్ ను నీరు గార్చారు
– అంచెలంచెలుగా ప్లాంట్ ను దెబ్బ తీశారు
– ఇది చాలా దుర్మార్గం
– 32 మంది బలిదానాలు తో ప్లాంట్ ఏర్పడింది
– ఎంతో మంది భూములు స్వచ్చందంగా ఇచ్చారు
– విశాఖ కు సొంత మైన్ లేదు
– ప్లాంట్ కి ఇచ్చే ముడిపదార్ధాలు ధరలు పెంచారు
– పాలకులు సిక్ ఇండస్ట్రీ గా మార్చారు
– అవిటి ప్రాజెక్టు, కుంటి ప్రాజెక్టు గా చిత్రీకరిస్తున్నారు
– నష్టాల సాకు చూపి అమ్మాలని చూస్తున్నారు
– ఆదుకొనే చిత్తశుద్ది ఎవరికి లేదు
– కాంగ్రెస్ హయంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఈ ప్లాంట్ విస్తరణ చేశారు
– 3 మిలియన్ టన్నుల సామర్థ్యం నుంచి 7 మిలియన్ టన్నులు పెంచారు
– 20 మిలియన్ టన్స్ కి పెంచేలా బ్లూ ప్రింట్ రెడీ చేశారు
– ఒకప్పుడు 7 మిలియన్ టన్స్ ఉత్పత్తిచేసే ప్లాంట్ నీ 1 మిలియన్ టన్స్ కి తగ్గించారు
– ఉత్పత్తి తగ్గడానికి ఈ పాలకులే కారణం
– గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కూడా పట్టించుకోలేదు
– జగన్ కి నష్టాల్లో ఉన్నట్లు తెలియదట
– బాబు హామీ ఇచ్చాడట..కానీ అమలు కలేదు
– విశాఖ భూముల మీద మోడీ కన్ను పడింది
– కార్మికులు గత 13 వందల రోజులుగా చేస్తున్న దీక్ష ప్రభుత్వాలకు కనిపించడం లేదు
– ఇద్దరు కార్మికులు కూడా చనిపోయారట
– కేంద్రంతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు కి ఎందుకు సంబంధం ఉండదు ?
– భరోసా ఇవ్వాల్సిన భాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు కి ఉంది
– వైఎస్ఆర్ హయంలో విశాఖ ప్లాంట్ కోసం అనంతపురం లో ఒక మైన్ కూడా ప్లాన్ చేశారు
– వైఎస్ఆర్ మరణం తర్వాత సొంత మైన్ ఇచ్చే భాధ్యత ను కేంద్రం మరిచింది
– వైఎస్ఆర్ మరణం తర్వాత ఎవరికి ప్లాంట్ కష్టాలు పట్టలేదు
– విశాఖ సెంటిమెంట్ తో కూడిన ప్లాంట్ అన్నారు
– సెంటిమెంట్ అయితే 4 వేల మందిని ఎలా తీసేశారు
– 30 ఏళ్ల నుంచి పని చేస్తున్న వాళ్ళు సెంటిమెంట్ కాదా ?
– విశాఖ స్టీల్ కష్టాలు పట్టని కేంద్రంతో చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు
– బాబు,పవన్ సమాధానం చెప్పాలి
– ఎందుకు మద్దతు ఇస్తున్నారో సమాధానం చెప్పాలి
– చంద్రబాబు ,పవన్ తక్షణం ఇక్కడకు రండి
– కార్మికులకు భరోసా ఇవ్వండి
– కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం
– ఒకరి మీద ఒకరు నెపం మోపకండి
– రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించాలి
– విశాఖ ప్రైవేటీకరణ ఆపాలి
– విశాఖ ప్లాంట్ కి నిధులు కేటాయించాలి
– సొంత మైన్ ఇవ్వాలి
– విధుల నుంచి తొలగించిన 4 వేల మందికి తక్షణం ఉద్యోగాల్లోకి తీసుకోండి
– 14 వేల మంది కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి
– సెయిల్ లో విలీనం చేయాలి
– గ్యారెంటీ ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది
– మీకు 48 గంటల సమయం ఇస్తున్నాం
– ఈ నెల 4 తేదీన మధ్యానం 1 గంటలోపు కాంట్రాక్టు కార్మికులను తీసుకోక పోతే ఆందోళన ఉదృతం చేస్తాం
– 4 వేల మందిని విధులో తీసుకోక పోతే నిరాహార దీక్ష చేస్తాం
– ఇదే ప్లాంట్ ఆవరణలో షర్మిలా రెడ్డి దీక్ష చేస్తుంది
– అవసరం అయితే రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకు వద్దాం
Read also: YS Sharmila Reddy: అన్నపై షర్మిల మరోసారి ఆక్రందన.. విలీనం, జగన్ మళ్లీ రాడంటూ…
YSRCP vs Sharmila: అన్న జగన్‌పై కామెంట్స్‌తో దూకుడు పెంచిన షర్మిల? వైయస్సార్‌సీపీ సోషల్ మీడియాను తట్టుకోగలరా?
Sajjala comments on Sharmila: షర్మిల మాట్లాడిన భాష, హడావుడి చూస్తే జాలి కలుగుతోంది..
Sharmila on YS Jagan: వచ్చీ రాగానే అన్నను టార్గెట్ చేసిన షర్మిల.. పీసీసీ చీఫ్‌గా తొలిరోజే వైసీపీ, టీడీపీ, బీజేపీపై విమర్శల బాణాలు
