Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా సందడి మొదలైంది. ’’కన్న ఊర్లో కాలెట్టానంటే నేనైనా నీలాంటోణ్నే.. మాటలన్నీ చేతల్లో పెడితే మీరైనా నాలాంటోళ్లే‘‘ అంటూ రామ్ చరణ్ అందుకున్నాడు. ఇదంతా మూవీ సందడిలో ఓ పార్ట్. స్టార్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.
బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. దిల్‌రాజు, శిరీశ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ‘రా మచ్చా మచ్చా…’ అని సాగే పాటని హైదరాబాద్‌లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పాటపై, రామ్ చరణ్ డ్యాన్స్ పై మిక్సుడు కామెంట్స్ వచ్చాయి.
’’కళ్లజోడు తీస్తే నీలాంటివాణ్నే… షర్టు పైకి పెడితే నీలాంటివాణ్నే‘‘ అని సాగే పాటకు థమన్ ఎస్ స్వరాలు సమకూర్చారు. సాహిత్యాన్ని అనంత శ్రీరామ్ అందించారు. నకాశ్ అజీజ్ సాంగ్ పాడాడు. హీరో ఇంట్రడక్షన్ నేపథ్యంలో వచ్చే ఈ పాటని వెయ్యి మందికి పైగా కళాకారులను తెరమీద చూపిస్తూ తీశారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన జానపద నృత్యాలు, సంగీత కళలు ఈ సాంగ్ లో చూడొచ్చు. గణేశ్ ఆచార్య నృత్య రీతులు సమకూర్చిన ఈ సాంగ్ లో రామ్‌చరణ్ ఓ బాణీకి సింగిల్ టేక్‌లో చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ ఓ యువ ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Read also: Game Changer: గేమ్ ఛేంజర్ నుంచి రా మచ్చా.. మచ్చా సాంగ్ ప్రోమో రిలీజ్
Game Changer: గేమ్ ఛేంజర్ అప్ డేట్.. రెండో సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..
Ram Charan: చరణ్ వాడే వస్తువుల ఖరీదు అన్ని కోట్లా?
Ram Charan Daughter: మెగా ఇంట ప్రిన్సెస్.. కుమార్తెకు జన్మనిచ్చిన ఉపాసన
RC16: రామ్ చరణ్‌కు జంటగా జాన్వీ కపూర్.. అఫిషియల్ అనౌన్స్‌మెంట్!!
