Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ లో కీలక మైలురాయిని చేరుకున్నాడు. మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంతవేగవంతంగా 27,000 పరుగులను చేరుకున్న క్రికెటర్ గా నిలిచాడు. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో ఈ ఘనత దక్కించుకున్నాడు. ఈ టెస్టులో 47 పరుగులు చేసిన విరాట్ .. ఈ అరుదైన రికార్డును చేరుకున్నాడు. కోహ్లి 594* ఇన్నింగ్స్‌లలో మైలురాయిని అధిగమించాడు.
ఇంతకుముందు ఈ వరల్డ్ రికార్డు టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 623 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను చేరుకున్నాడు. 226 టెస్టు, 396 వన్డే, ఒక టీ20 ఇన్నింగ్స్‌లో మాస్టర్ బ్లాస్టర్ ఈ మైలురాయిని అందుకున్నాడు. లేటెస్ట్ గా సచిన్ ఆల్‌టైమ్ రికార్డును కోహ్లి (594* ) బద్ధలు కొట్టాడు.
రన్ మెషీన్ కు అడ్డేది?
కోహ్లి 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. కెరీర్ ప్రారంభం నుంచి కోహ్లి తనదైన ముద్ర వేస్తూనే ఉన్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తూ రన్‌మిషన్‌గా పేరు తెచ్చుకున్నాడు. విరాట్ ఇప్పటి దాకా టెస్టుల్లో 8,871, వన్డేల్లో 13,906, టీ20లలో 4,188 రన్స్ చేశాడు. అలాగే వన్డేల్లో 50, టెస్టుల్లో 29, టీ20లో ఒక శతకం కోహ్లీ నమోదు చేశాడు.
Read also: Virat Kohli Water: విరాట్ కోహ్లీ తాగే వాటర్ ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
MS Dhoni Kohli Remuneration: ధోనీ, విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకొనే ఆటగాడు ఎవరో తెలుసా?
Virat Kohli Assets: కింగ్ కోహ్లీ నికర ఆస్తుల విలువ ఇదే.. స్టాక్ గ్రో వెల్లడించిన ఆసక్తికర విశేషాలు
Virat Kohli : డోంట్ మెస్ విత్ కింగ్ కోహ్లీ.. ఎవరిది వాళ్లకిచ్చేయడం విరాట్ స్పెషల్!
Shubman Gill: శుభ్‌మన్ గిల్‌తో ప్రేమ.. స్టార్ హీరోయిన్ ఏమందంటే..
