AP Liquor Policy: ఏపీలో మందుబాబులకు ఇది గుడ్ న్యూస్. రెండేళ్ల కాల పరిమితితో కొత్త మద్యం పాలసీని చంద్రబాబు ప్రభుత్వం ఖాయం చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకు కొత్త పాలసీ అమలులో ఉంటుంది. మొత్తం 3,396 లిక్కర్ షాపులకు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
ఈరోజు నుంచే దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకునే వీలుంది. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. ఒక్కో దానికి రూ.2 లక్షలు చొప్పున నాన్ రిఫండబుల్ ఫీజు కట్టాలి. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంకు చలానా ద్వారా కట్టొచ్చు. డీడీ తీసుకుని నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో ఇవ్వాల్సి ఉంటుంది.
జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ తీసి, లైసెన్సుల కేటాయింపు జరుగుతుంది. ఈ నెల 11న ఈ తతంగం ఉంటుంది. మరుసటి రోజు 12వ తేదీ నుంచి లైసెన్సుదారులు కొత్త షాపులు మొదలు పెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) ఆధ్వర్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాల గడువు సోమవారంతో ముగిసింది. ఈ తరుణంలో కొత్త షాపులు వచ్చే వరకు ఇప్పుడున్న దుకాణాలే కొనసాగుతాయి.
లైసెన్సు ఫీజు రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షలు
– కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ఏరియా జనాభా ప్రకారం 4 నాలుగు శ్లాబుల్లో లైసెన్సు ఫీజులు ఖాయం చేశారు.
– మొదటి సంవత్సరం 10,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షలు
– 5,00,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.85 లక్షలు
– రెండో ఏడాది ఈ ఫీజులపై 10 శాతం చొప్పున పెంపు
– ఏటా ఆరు విడతల్లో లైసెన్సు ఫీజు కట్టాలి. ఇది రిటైల్ ఎక్సైజ్ సుంకం.
– రిటైల్ వ్యాపారం చేసే లైసెన్సుదారుకు 20 శాతం మేర మార్జిన్ ఉంటుంది.
– మున్సిపాలిటీల్లో తప్ప మిగతా చోట్ల లిక్కర్ షాపులను మోడల్ స్టోర్స్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
– ఇందుకు ఏడాదికి రూ.5 లక్షలు అదనంగా లైసెన్సు ఫీజు కట్టాలి.
– ప్రస్తుతం నోటిఫై చేసిన 3,396 మద్యం దుకాణాలకు అదనంగా 12 ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేస్తారు.
– విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురంలో ఇవి ఏర్పాటు అవుతాయి.
– ఈ స్టోర్లకు ఐదేళ్ల టైమ్ పీరియడ్ ఉంటుంది.
– లైసెన్సు ఫీజు ఏడాదికి రూ.కోటి.
ధరలు తగ్గింపు
– మద్యం ధరలు బాగా తగ్గనున్నాయి. రూ.99కే క్వార్టర్ లిక్కర్ అమ్మేలా ధరలు ఉంటాయి. గత ప్రభుత్వంలో విధించిన 10 రకాల పన్నులను 6కు కుదించారు.
Read also: Liquor: అత్యంత కిక్కు ఇచ్చే లిక్కర్ ఏదో తెలుసా?
AP Liquor Policy: ఏపీలో నూతన మద్యం పాలసీకి కేబినెట్ సబ్ కమిటీ
Lifestyle: మనిషి రోజుకు ఎన్ని గంటలు నిల్చుకోవాలి? కూర్చోవాలి?
Mumbai Actress: ముంబై నటి వ్యవహారంలో అసలేం జరిగింది? ఫక్తు రాజకీయమేనా?
Andhra Pradesh: గుడ్లవల్లేరులో దారుణం.. లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా!
