Malladi Vishnu: రాష్ట్రంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ దుర్భుద్ధితో ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందన్నారు. టిటిడి లడ్డూ ప్రసాదాన్ని ఈ ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుంటుందన్నారు.
’’లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని…ప్రజలను గందరగోళంలోకి నెట్టేసింది. నెయ్యి ట్యాంకర్లు ఎప్పుడొచ్చాయి…ఎప్పుడు తిప్పిపంపించారో డేట్లతో సహా చెప్పాం. ఈవో ఒకలా…చంద్రబాబు మరోలా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు రౌడీల్లా మారారు.
పోలీసులు ఎమ్మెల్యేల కనుసన్నల్లో నడుస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళితే వారిపైనే కేసులు పెడుతున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆ ప్రాంతాన్ని దోచుకుతింటున్నాడు. సొంత పార్టీ వాళ్లే టీడీపీ ఆఫీస్ కు వెళ్లి కొలికపూడి పై ఫిర్యాదు చేశారు.
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రభుత్వ వైద్యుడి పై దాడి చేసి బూతులు తిట్టాడు. పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారు…ప్రజలకు సమాధానం ఏం చెబుతారు. ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అంబేద్కర్ బ్యానర్ ను చించేసి…అవమానించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే ఆమె దగ్గర ఓ రెడ్ బుక్ ఉందని బెదిరిస్తున్నారు
కూటమి ఎమ్మెల్యేలను గెలిపించింది ఇందుకేనా.. వరద బాధితులకు సాయం చేయాల్సింది పోయి…వారినే బెదిరిస్తున్నారు. వరద బాధితుల పై లాఠీఛార్జి చేయడమేంటి.. సాయం అడిగినందుకు చెట్టుకు కట్టేసి కొట్టడమేంటి. విజయవాడ మునిగిపోతే … నిర్లక్ష్యంగా ఎన్యుమరేషన్ చేశారు.
ఎన్యుమరేషన్ సరిగా చేయాలని మేం స్వయంగా కలెక్టర్ ను కలిసి కోరాం. కానీ మా విజ్ఞుప్తులను పట్టించుకోలేదు. లడ్డూ వివాదం పై చంద్రబాబు సిట్ వల్ల ఏం ఉపయోగం.. సిట్ చంద్రబాబుకు బీ టీమ్ వంటిది. మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలని ప్రయత్నించి…ప్రభుత్వమే ప్రజల ముందు దోషిగా నిలబడింది. రాజకీయాల కోసమే లడ్డూ అంశాన్ని చంద్రబాబు వాడుకున్నారు
చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే లడ్డూ వివాదం పై సీబీఐ విచారణ జరిపించాలి. సుప్రీంకోర్టు పై మాకు అచెంచలమైన విశ్వాసం ఉంది. మా హయాంలో ఏ తప్పూ జరగలేదని…మేం గుండెల మీద చేయి వేసుకుని చెబుతున్నాం. జగన్ మోహన్ రెడ్డి పై బురద జల్లాలని చూస్తే…. ఆ బురద మీపైనే పడింది. జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్లలో హిందూత్వాన్ని కాపాడారు. కూటమి వందరోజుల పాలనలో అరాచకం…రౌడీయిజం…ఘోరాలకు అడ్డేలేకుండా పోయింది. రౌడీ ఎమ్మెల్యేల అరాచకాల పై చర్యలు తీసుకోకపోతే వైసీపీ పార్టీ ఉద్యమిస్తుంది’’ అని మల్లాది విష్ణు అన్నారు.
YS Jagan Decleration: జగన్ తిరుమల పర్యటన రద్దు.. డిక్లరేషన్‌పై ఎందుకీ వివాదం?
YS Jagan: వైయస్ జగన్ తిరుమల వెంకన్న దర్శనం వేళ డిక్లరేషన్ వివాదం
Tirumala Laddu Row: కల్తీ నెయ్యిపై మూడు రోజుల పాటు సిట్ విచారణ
Tirumala: కలి ప్రభావం.. అప్పుడే ఏమైంది..? ఇంకా మున్ముందు చాలా చూడాలి భక్తులారా…!
