Shubman Gill: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. కొన్ని నెలలుగా అనన్య పాండే తన సినిమాల కారణంగానే కాకుండా తన వ్యక్తిగత జీవితం కారణంగా కూడా వార్తల్లోకి ఎక్కింది. అనన్య పాండే కొన్నేళ్ల పాటు ఆదిత్య రాయ్ కపూర్‌తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. విదేశాల్లో వీరిద్దరూ కలిసి తిరిగిన రొమాంటిక్ ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే కొన్నాళ్ల కిందట వీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.
ఆదిత్య రాయ్ కపూర్ తో విడిపోయిన తర్వాత అనన్య పాండే హార్దిక్ పాండ్యతో ప్రేమలో ఉందని ప్రచారం సాగింది. వీరిద్దరూ డ్యాన్స్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అనంత్ అంబానీ పెళ్లిలో వీరద్దరూ అలరించారు. తాజాగా ఇప్పుడు టీమిండియా క్రికెటర్ శుభమన్ గిల్ తో అనన్య డేటింగ్ లో ఉందని రూమర్లు వస్తున్నాయి.
అనన్య పాండే, శుభ్‌మన్ గిల్ కలిసి కొన్ని రోజుల కిందట ఓ యాడ్ లో నటించారు. అప్పటి నుంచే వీరిద్దరు ప్రేమలో ఉన్నారని నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అభిమాని ప్రశ్న కూడా అడిగారు. ‘విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒక యాడ్ షూట్ సమయంలో మొదటిసారి కలిశారు. అనంతరం ప్రేమలో పడ్డారు. విరాట్, అనుష్క లాంటి బంధం మీకూ శుభ్మన్కూ ఉందా?’ అని ఆమెకు ప్రశ్న ఎదురైంది. దీంతో అనన్య స్పందిస్తూ.. ‘బేసిక్ గా మేం చాలా డిఫరెంట్. నాకు, శుభ్‌మన్‌కు ఎప్పటికీ సంబంధం లేదు. యాడ్ ప్రమోషన్ కోసం మాత్రమే కలుసుకున్నాం. తర్వాత మా మధ్య మాటలు కూడా లేవు’ అని క్లారిటీ ఇచ్చింది.
MS Dhoni Jersey: ధోనికి బీసీసీఐ గౌరవం.. నంబర్ 7 జెర్సీకి వీడ్కోలు
Virat Kohli Water: విరాట్ కోహ్లీ తాగే వాటర్ ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Virat Kohli Assets: కింగ్ కోహ్లీ నికర ఆస్తుల విలువ ఇదే.. స్టాక్ గ్రో వెల్లడించిన ఆసక్తికర విశేషాలు
CSK vs RCB: చెపాక్‌లో సీఎస్కే బోణీ.. మొదటి మ్యాచ్ దేవుడికి ఇచ్చేయడం మా ఆనవాయితీ తలా..!
