HomeAndhra PradeshDurga Temple: దసరా రోజు రూ.500 టికెట్టు కొన్న వారికి దర్శనం ఎలా అంటే..

Durga Temple: దసరా రోజు రూ.500 టికెట్టు కొన్న వారికి దర్శనం ఎలా అంటే..

Durga Temple: దసరా ఉత్సవాల నేపథ్యంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష చేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన , పోలీస్ కమిషన్ ఎస్.వి.రాజశేఖర్ బాబు , ఎండో మెంట్ కమిషనర్ సత్యనారాయణ  తదితరులు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ..
’’అన్ని శాఖల సమన్వయంతో దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తాం.  120 సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నాం. సిసి కెమెరాలను కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తాం. వీవీఐపీ దర్శనాలకు రెండు టైమ్ స్లాట్లు.

ఉదయం 8 నుంచి 10 గంటల వరకూ , మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకూ వీవీఐపీల టైమ్ స్లాట్లు. వృద్ధులకు , దివ్యాంగులకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకూ దర్శనం టైమ్ స్లాట్. 500 రూపాయలు తీసుకున్న వారికి కూడా అంతరాలయం వెలువల నుంచే దర్శనం. అన్నప్రసాదం , లడ్డూ ప్రసాదాల నాణ్యతలో రాజీ పడేది లేదు.

ఏ చిన్న పొరపాటు జరిగినా అధికారులదే బాధ్యత. 35 లక్షల వాటర్ బ్యాటిల్స్ , వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నాం. విజయవాడ నగరమంతా విద్యుత్ అలంకరణ చేస్తాం. దేవాదాయశాఖ , దుర్గగుడి తరపున రేపు సీఎంను ఉత్సవాలకు ఆహ్వానిస్తాం. మూలానక్షత్రం రోజు అమ్మవారికి సీఎం పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అక్టోబర్ 1వ తేదీ చివరిసారిగా దసరా ఉత్సవాల నిర్వహణ పై తుది రివ్యూ చేస్తాం.’’ అని తెలిపారు.

ఇవీ చదవండి: YS Jagan in Kalyanadurgam: మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చినది మీ బిడ్డ: కళ్యాణదుర్గంలో సీఎం జగన్
Goddess Durga: సూర్యభగవానుని, దుర్గమ్మను ఎలా పూజించాలి?
Tirumala Laddu: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం.. దుర్గమ్మకు సీఎం జగన్‌ పట్టు వస్త్రాలు
Daily Puja: పూజ సమయంలో ఇలాంటి పద్ధతులు పాటిస్తే సకల శుభాలు..
RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు