Pooran: వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూర్ మరోసారి చెలరేగాడు. టీ20 క్రికెట్ అంటేనే రెచ్చిపోయి ఆడే పూరన్.. మరోసారి అదరగొట్టాడు. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరఫున పూరన్ ఆడుతున్నాడు. తాజాగా ఓ అరుదైన రికార్డును చేరుకున్నాడు.
టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో హయ్యస్ట్ రన్స్ చేసిన క్రికెటర్ గా పూరన్ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. శనివారం సీపీఎల్‌లో భాగంగా బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 రన్స్ చేసిన పూరన్.. ఈ మైలురాయిని అధిగమించాడు.
ఈ సంవత్సరం టీ20ల్లో ఇప్పటి దాకా 65 ఇన్నింగ్స్‌ల్లో 42.02 సగటుతో 2,059 పరుగులు పూరన్ చేశాడు. అందులో 14 అర్ధశతకాలు ఉన్నాయి. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పేరిట ఉండగా దాన్ని పూరన్ తిరగరాశాడు.
ఈ ఏడాది టీ20ల్లో వెస్టిండీస్, డర్బన్ సూపర్ జెయింట్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్, ఎంఐ న్యూయార్క్, నార్తర్న్ సూపర్ ఛార్జర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, రంగ్‌పూర్ రైడర్స్ జట్ల తరఫున పూరన్ మ్యాచ్ లు ఆడాడు.
Read also: IPL: టీమిండియా క్రికెటర్లకు మరో గుడ్ న్యూస్..
IPL Final 2023: తిరుగులేని మహేంద్రుడు.. ఐదో టైటిల్ విశేషాలు ఇవే..
IPL 2023: తిలక్ వర్మ మరో ఛాన్స్ కొట్టేశాడు.. చేతులు కలిపిన రిలయన్స్!
MS Dhoni Kohli Remuneration: ధోనీ, విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకొనే ఆటగాడు ఎవరో తెలుసా?
MS Dhoni Six: మహేంద్రసింగ్ ధోని భారీ సిక్సర్లు.. వీడియో వైరల్.. సింహం సిద్ధమవుతోంది!!
