HomeBusinessSBI Good News: డిపాజిటర్ల కోసం శుభవార్త చెప్పిన ఎస్‌బీఐ.. 

SBI Good News: డిపాజిటర్ల కోసం శుభవార్త చెప్పిన ఎస్‌బీఐ.. 

SBI Good News: మరింత మంది డిపాజిటర్లను ఆకర్షించేలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక ఆఫసర్లను తీసుకొస్తోంది. రికవరింగ్ డిపాజిట్లు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (SIP) వంటి వినూత్న స్కీమ్స్ ను ఎస్‌బీఐ తీసుకురానుంది. ఆర్థికంగా పైకిరావాలనుకునే వారు విభిన్న పెట్టుబడి ఎంపికల కోసం చూస్తుంటారు. అలాంటి కస్టమర్ల అభివృద్ధి కోసం ఎస్‌బీఐ చర్యలు చేపట్టిందని చైర్మన్ సీఎస్ శెట్టి వెల్లడించారు.

కస్టమర్ల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్స్, రికవరింగ్ డిపాజిట్స్, సిప్ పెట్టుబడుల కాంబోతో కొత్త సేవ తేవాలనే యోచనలో ఎస్‌బీఐ ఉందన్నారు. ఈ ఆవిష్కరణలు మొత్తం యంగ్ కస్టమర్లను, ముఖ్యంగా Gen Z తరాన్ని అట్రాక్ట్ చేసేందుకు ఉద్దేశించామన్నారు.

ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో చాలామంది సేవింగ్స్ చేయడం లేదా పెట్టుబడులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారన్నారు. పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరూ లాభాలనే కోరుకుంటారని, రిస్క్ ఉన్న వాటికంటే వారి పెట్టుబడులకు అధిక లాభాలు వచ్చే రంగాలవైపు మళ్లుతున్నారని, అలాంటి వారి కోసం కొత్త బ్యాంకింగ్ సర్వీసులను తేవాలన్నారు.

డిపాజిట్లను వృద్ధి చేయడంతో పాటు దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను పెంచడానికి ప్రణాళిక రచిస్తున్నామన్నారు. డిపాజిట్ సమీకరణలో కస్టమర్ సర్వీస్, వడ్డీ రేట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. సమతుల్య వడ్డీ రేట్లు, ఉన్నతమైన కస్టమర్ సేవను అందించడంపైనే ఎస్‌బీఐ దృష్టి ఫోకస్ పెట్టిందని వివరించారు. డిజిటల్ బ్యాంకింగ్‌లో ఎస్‌బీఐ భారీ పురోగతి సాధించిందన్నారు. రోజూ 50,000 నుంచి 60,000 సేవింగ్ బ్యాంకు ఖాతాలను తెరుస్తోందని చెప్పారు.

ఇవీ చదవండి: SLBC Meeting: కౌలు రైతులకు బ్యాంకులు మరింత చేయూతను అందించాలి: ఆర్థిక మంత్రి బుగ్గన
YS Jagan in Eluru: చంద్రబాబు 14 ఏళ్లలో బ్యాంకు ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా అక్కచెల్లెమ్మలకు జమ చేశారా?
Mumbai Actress: ముంబై నటి వ్యవహారంలో అసలేం జరిగింది? ఫక్తు రాజకీయమేనా?
Amazon Fresh: ఇండియాలో అమెజాన్ ఫ్రెష్ జోష్.. 130కి పైగా పట్టణాల్లో విస్తరణ
Budget 2024: కేంద్ర బడ్జెట్ విశేషాలు.. 2024-25లో కేటాయింపులు, ఖర్చులు ఇవీ!
RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు