IPL: టీమిండియా క్రికెటర్లకు మరో శుభవార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడే మన క్రికెటర్లకు బీసీసీఐ మంచి న్యూస్ అందించింది. ఐపీఎల్-2025 సీజన్ నుంచి ప్రతి ఆటగాడికీ మ్యాచ్ ఫీజు కింద రూ.7.50 లక్షలు అందించాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా ఎక్స్ వేదికగా తెలిపారు.
“ఐపీఎల్ మ్యాచ్ ఫీజులు పెంచాలని నిర్ణయించాం. మా క్రికెటర్లు ఇకపై ఒక్కో గేమ్‌కు రూ.7.5 లక్షల ఫీజు అందుకుంటారు. ఈ చారిత్రత్మక నిర్ణయాన్ని ప్రకటిస్తున్నందుకు వెరీ హ్యాపీ.‘‘ అని జై షా పేర్కొన్నాడు.
ఓ క్రికెటర్ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడితే ఐపీఎల్ కాంట్రాక్ట్ లో దక్కే మొత్తంతో పాటు అడిషనల్ గా రూ.1.05 కోట్లు పొందే వీలుంది. ప్రతి ఫ్రాంచైజీ సీజన్ మ్యాచ్ ఫీజుగా కూడా రూ.12.60 కోట్లు కేటాయిస్తుందన్నది తెలిసిందే. ఐపీఎల్‌కు, ప్లేయర్లకు ఇది కొత్త శకమని జైషా తెలిపాడు. కాగా గతంలో ఒక్కో మ్యాచ్‌కు ఫీజు రూ.2 లక్షలు – రూ.4 లక్షల వరకు ఇచ్చేవారు.
Read also: IPL Final 2023: తిరుగులేని మహేంద్రుడు.. ఐదో టైటిల్ విశేషాలు ఇవే..
IPL 2023: తిలక్ వర్మ మరో ఛాన్స్ కొట్టేశాడు.. చేతులు కలిపిన రిలయన్స్!
Duck out: క్రికెట్‌లో డకౌట్ అంటే ఏమిటి? ఈ పదం ఎలా వచ్చింది?
MS Dhoni Cutout: నందిగామలో 77 అడుగుల ధోని కటౌట్.. మహేంద్రుడి బర్త్‌డే స్పెషల్
T10 Cricket: టీ10 క్రికెట్‌లో సంచలనం.. స్కాట్లాండ్ బ్యాటర్ రికార్డు సెంచరీ
