HomeBusinessAmazon Fresh: ఇండియాలో అమెజాన్ ఫ్రెష్ జోష్.. 130కి పైగా పట్టణాల్లో విస్తరణ

Amazon Fresh: ఇండియాలో అమెజాన్ ఫ్రెష్ జోష్.. 130కి పైగా పట్టణాల్లో విస్తరణ

Amazon Fresh: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మనదేశంలో వేగంగా విస్తరిస్తోంది. సర్వీసు విషయంలో తగ్గేదే లేదంటోంది. తాజాగా అమెజాన్ ఫ్రెష్ మరింత విస్తరించింది. మనదేశంలో ఏకంగా 130కి పైగా పట్టణాలు, నగరాల్లో ఈ సర్వీసులు అందిస్తోంది అమెజాన్ ఫ్రెష్.

ఇందులో పండ్లు, కూరగాయలు, చిల్డ్ ఉత్పత్తులు, సౌందర్యం, బేబీ, పర్సనల్ కేర్, మరియు పెట్ ఉత్పత్తులు, ఇతర నిత్యావసరాలు వంటి తడి మరియు పొడి కిరాణా సరుకుల చేరవేత ఉంటుంది. అమెజాన్ ఫ్రెష్ సెల్లర్స్ పండ్లు, కూరగాయలను 11,000కి పైగా రైతుల నుంచి సేకరిస్తారు. ఇందులో 4-స్టెప్ నాణ్యతా తనిఖీ ద్వారా ఉత్పత్తి నాణ్యతను నిర్ధారణ చేస్తారు.

అమెజాన్ ఫ్రెష్ ఇండియాలో కిరాణా షాపింగ్ ను భారీగా విస్తరిస్తున్నట్లు అమెజాన్ ఫ్రెషన్ ఇన్ డైరెక్టర్ శ్రీకాంత్ శ్రీ రామ్ తెలిపారు. భారత్ లో 130 పట్టణాల్లో మా కస్టమర్స్ ఇంటి ముందుకే తాజా ఉత్పత్తి, నిత్యావసరాలు తెస్తామంటూ వెల్లడించారు. కస్టమర్స్ కు సేవలు అందించడానికి విస్తరణ, దృష్టి కేంద్రీకరణలు తమ నిబద్ధతను ప్రదర్శిస్తాయని స్పష్టం చేశారు.

తాజా నాణ్యమైన ఉత్పత్తులు, నిత్యావసరాల కోసం ఉత్తమమైన ఆన్ లైన్ షాపింగ్ అనుభవాన్ని వినియోగదారులకు అందిస్తామన్నారు. కస్టమర్స్ క్యాష్ బాక్, ఆఫర్స్, మరియు బ్యాంక్ డిస్కౌంట్స్ నుంచి ప్రయోజనాలు పొందవచ్చని, ప్రతి కొనుగోలుపైన మంచి ఆఫర్లు అందిస్తామన్నారు.

Read also: Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? ఏవి తినాలి? ఏవి తినకూడదు?
Ramadan in Malaysia: మీకు తెలుసా.. ముస్లిం దేశం మలేషియాలో రంజాన్‌ నిబంధనలు ఎలా ఉంటాయంటే..
Priyamani: ప్రియమణిని ఇలా తడిమేశావేంటి బోనీ కపూర్‌ జీ!
WhatsApp: వాట్సప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లు ఎలా చూడాలంటే..
Lifestyle: ఈ 4 లక్షణాలు మీకున్నాయా? అయితే మీరు ఏ పనిలోనూ ఓడిపోరు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు