The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ది రాజా సాబ్ (The Raja Saab) చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ కాస్త డిఫరెంట్ గా కనిపించనున్నారు. తాజాగా రాజా సాబ్ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది. వరుస సినిమాలతో ఇటీవల ప్రభాస్ మాంచి జోరుమీద ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నటించిన తదుపరి చిత్రం రాజా సాబ్ లో భిన్నమైన కథతో ఉంటుందని తెలుస్తోంది.
రాజా సాబ్ చిత్రం చిత్రీకరణ శరవేగంగా జరుపుకొంటోంది. ఈ మూవీ నుంచి ఇవాళ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ పేరుతో ప్రత్యేకంగా ఓ చిన్న వీడియోను సినిమా యూనిట్ వదిలింది. ఈ గ్లింప్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ సినిమా అప్ డేట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఏళ్లకు ఏళ్లు ఎదరు చూసిన అభిమానులకు ఇటీవల వరుసగా డార్లింగ్ మూవీ అప్ డేట్లు వస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ లో మంచి జోష్ వస్తోంది.
చాలా కాలం తర్వాత ప్రభాస్ ఓ క్లాసీ లుక్ లో దర్శనమిచ్చారు. ఈ చిత్రం హారర్, రొమాంటిక్, కామెడీ నేపథ్యంలో ఉంటుందని దర్శకుడు మారుతి అందులో హింట్ ఇచ్చారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ స్వరాలు అందిస్తున్నారు. 2025 ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రాజాసాబ్ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
ఇవీ చదవండి: Kalki Trailer: కల్కి ట్రైలర్ ఆగయా.. రికార్డ్స్ చెక్ చేసుకోమంటున్న ప్రభాస్
What Is Project K Movie : కల్కి 2898 AD.. ఈసారి హాలివుడ్ రేంజ్‌లో ప్రభాస్ దుమ్ము రేపుతాడా?
Tripti Dimri: బాలీవుడ్‌లో ఎంత మంది అందగత్తెలున్నా.. త్రిప్తి డిమ్రీ అందం వేరయా!
Fear song from Devara: దేవర నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. మ్యాన్ ఆఫ్ మాసెస్ కెవ్వు కేక!
RC16: రామ్ చరణ్‌కు జంటగా జాన్వీ కపూర్.. అఫిషియల్ అనౌన్స్‌మెంట్!!
