HomeDevotionalLifestyle: ఈ 4 లక్షణాలు మీకున్నాయా? అయితే మీరు ఏ పనిలోనూ ఓడిపోరు!

Lifestyle: ఈ 4 లక్షణాలు మీకున్నాయా? అయితే మీరు ఏ పనిలోనూ ఓడిపోరు!

Lifestyle: జీవితంలో కొన్ని లక్షణాలు కలిగి ఉంటే ప్రపంచంలో ఏ పనిలోనూ ఓటమి అనేదే మీ దరి చేరదు. అన్ని పనులూ జరిగిపోతాయి. ప్రతి పనిలో విజయం మీదే. ఇంతకీ అవేంటో అనుకుంటున్నారా?

ధ్రుతిహి
దృష్టిహి
మతిహి
దాక్ష్యం

జీవితంలో ఎప్పటికైనా అనుసరించదగ్గ లక్షణాలు ఇవి. ఓ కాగితంపై రాసుకుని మరీ ప్రయత్నించి చూడండి. ఇక మీ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ప్రతి ఒక్కరూ మనలో ఈ లక్షణాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.

ధృతిహి
అంటే మీకు ధైర్యం ఉండాలి. ఏ చిన్న కష్టం వచ్చినా కొందరు విపరీతంగా భయపడిపోతుంటారు. ఇలా భయపడిపోవడం వల్ల ఏ పనీ జరగదు. మనిషి ఎప్పటికైనా చనిపోవాల్సిందే. కొన్ని విషయాల్లో తెగింపు ఉండాలి. ధైర్యం చేయాలి. ధైర్యంగా ఉండటం వల్ల మీకు విజయం కచ్చితంగా దక్కుతుంది. సమస్యలను అధిగమించడానికి తోడు కావాలని కోరుకోరాదు. నీ వెంట ఎవరూ తోడు ఉండరు, నీకు కావాల్సింది నువ్వే తెచ్చుకోవాలి. సాధించుకోవాలి.

దృష్టిహి
అంటే ముందు చూపు ఉండాలి. జీవితంలో మనకు ఎదురయ్యే ప్రమాదాలు, ఇబ్బందుల గురించి కాస్త ముందుచూపుతో వ్యవహరించడం అలవర్చుకోవాలి. లేదంటే తీరా కష్టం వచ్చిన సందర్భాల్లో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

మతిహి
అంటే తెలివితేటలు. ఏ పని ఎలా చేయాలి? ఎవరిపైనా ఆధారపడకుండా మన పనులు మనమే చక్కదిద్దుకోవడం గురించి తెలివిగా వ్యవహరించాలి. ఏదైనా పని చేస్తున్నామంటే తెలివితో వ్యవహరించాలి. ఆ తెలివి లేకుండా పనులు చేస్తే పనులు జరగవు.

దాక్ష్యం
అంటే సమర్థత. అసమర్థుడు ఎప్పుడూ ఏ కార్యాన్నీ సాధించలేడు. ఏ కార్యక్రమం, కార్యంలోనైనా సమర్థంగా వ్యవహరించాలి.

ఈ నాలుగు లక్షణాలూ మీకు ఉంటే మీరు శ్రీ ఆంజనేయుడి మాదిరిగా పనులు, కార్యాల్లో విజయం సాధించడం ఖాయం. మీకు అపజయమే ఉండదని నిపుణులు చెబుతున్నారు.

ఇవీ చదవండి: Wife and Husband: భర్త మాట భార్య వినాలంటే ఏం చేయాలి?
Wife: భార్య ప్రవర్తన మారాలంటే కొన్ని చిట్కాలు ఇవిగో..
Dharma Raju: జూదంలో భార్యని ఓడిన ధర్మరాజు.. ధర్మానికి ప్రతీక ఎలా అవుతాడు?
Wife and Husband Relationship: భార్యా భర్తల మధ్య నిందలు పెరిగాయా?
Arunachalam: అరుణాచలం టూర్ ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవీ..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు