HomeBusinessBudget 2024: కేంద్ర బడ్జెట్ విశేషాలు.. 2024-25లో కేటాయింపులు, ఖర్చులు ఇవీ!

Budget 2024: కేంద్ర బడ్జెట్ విశేషాలు.. 2024-25లో కేటాయింపులు, ఖర్చులు ఇవీ!

Budget 2024: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. భారీ అంచనాల నడుమ లోక్ సభలో నిన్న ఉదయం 11 గంటలకు ఆమె బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టారు. సుమారు గంటన్నరపాటు ఆమె ప్రసంగం కొనసాగింది. వికసిత భారత్ లక్ష్యంగా ఎన్డీయే సర్కారు పని చేస్తోందంటూ చెప్పిన నిర్మలమ్మ.. యూనియన్ బడ్జెట్ లో పలు కీలక విషయాలు వెల్లడించారు.

కేంద్ర బడ్జెట్‌ పరిమాణం రూ.48.21 లక్షల కోట్లుగా ప్రకటించారు. మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు, పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు, ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని అంచనా కట్టారు. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లుగా నిర్మల చెప్పారు.

కేంద్ర బడ్జెట్‌ – రూ.48.21 లక్షల కోట్లు
కేంద్ర బడ్జెట్‌ పరిమాణం రూ.48.21 లక్షల కోట్లు
మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు
పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు
ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని అంచనా
అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు అంచనా
క్యాపిటల్‌ గెయిన్స్‌ విధానం సరళీకరణ.. లాంగ్‌ టర్మ్‌ గెయిన్స్‌పై 12.5 శాతం పన్ను
క్యాపిటల్‌ కనిష్ఠ పరిమితి రూ.1.25 లక్షలు
స్టార్టప్‌లకు ప్రోత్సాహకం.. ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దు

కేంద్ర బడ్జెట్ పై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ఈ బడ్జెట్ పేద-మధ్యతరగతి వర్గాల సాధికారత కోసమేనని వ్యాఖ్యానించారు. బడ్జెట్‌ ను ప్రశంసించారు.. దళితులు, అణగారిన వర్గాలకు ఊతమిచ్చే బడ్జెట్ గా ఆయన అభివర్ణించారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులయ్యారని మోదీ చెప్పారు.

ఏపీకి సరైన గుర్తింపు
కేంద్ర బడ్జెట్‌పై తెలుగుదేశం పార్టీ ఎంపీలు సంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి సరైన గుర్తింపును, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. కష్టాల్లో ఉన్న ఏపీని ఆదుకోవాలని సీఎం చంద్రబాబు కోరారని, అందుకు అనుగుణంగా బడ్జెట్‌ లో నిధులు కేటాయించిన కేంద్రానికి థ్యాంక్స్ తెలిపారు.

* గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు
* రూ.32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌
* మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్లు
* మహిళాభివృద్ధికి రూ.3 లక్షల కోట్లు
* గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు
* అర్బన్‌ హౌసింగ్‌ కోసం రూ.2.2 లక్షల కోట్లు
* వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు

* స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి
* మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీతగ్గింపు
* ముద్రలోన్‌ పరిమితి రూ.20 లక్షలకు పెంపు
* యువత కోసం ఐదు పథకాలతో పీఎం ప్యాకేజ్
* విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.లక్షా 48 వేల కోట్లు
* కోటి ఇళ్లకు సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్

* ఐదు వరద బాధిత రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు
* MSMEలకు క్రెడిట్‌ గ్యారంటీ పథకాలు
* త్వరలో రూ.100 కోట్ల రుణాలు ఇచ్చే కొత్త పథకం
* తనఖాలు, గ్యారంటీలు లేకుండా.. యంత్రపరికరాల కొనుగోలుకు టెర్మ్‌ రుణాలు
* 100 నగరాల్లో ప్లగ్ &ప్లే తరహా పారిశ్రామిక పార్కులు
* దేశంలో చిన్న ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రోత్సాహం
* వారణాసి తరహాలో గయాలో టెంపుల్ కారిడార్‌
* ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై 25 శాతం పెరిగిన పన్ను

* స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంపు
* కొత్త పన్ను విధానంలో ఉన్నవారికి మాత్రమే దీని వల్ల ప్రయోజనం
* కొత్త పన్ను విధానంలో మార్పులు.. సున్నా నుంచి రూ.3 లక్షల వరకు పన్ను సున్నా
* రూ.3-7 లక్షల వరకు 5 శాతం పన్ను
* రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను
* రూ.10-12 లక్షల వరకు 15 శాతం పన్ను
* రూ.12- 15 లక్షల 20 శాతం శాతం పన్ను
* రూ.15 లక్షల పైన 30 శాతం పన్ను
* కొత్త విధానంలో రూ.17,500 పన్ను ఆదా
* స్టాండర్డ్‌ డిడక్షన్ రూ.50వేల నుంచి రూ.75 వేలకు పెంపు

* సెల్‌ఫోన్లపై 15 శాతం కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు
* లెదర్‌ ఉత్పత్తులపై పన్ను శాతం తగ్గింపు
* మూడు క్యాన్సర్ మందులపై జీఎస్టీ తొలగింపు
* ఎక్స్‌రే మిషన్లపై జీఎస్టీ తగ్గింపు
* 25 రకాల కీలక ఖనిజాలపై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు
* సోలార్‌ ఉత్పత్తులపై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు

* వాణిజ్య అనుకూల విధానాలకు జన్‌ విశ్వాస్‌ బిల్లుతో మరిన్ని సంస్కరణలు
* భవిష్యత్‌ తరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
* యూఎల్‌ పిన్‌ ద్వారా ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయింపు
* ప్రతి భూకమతానికి యూఎల్‌ పిన్‌ నెంబర్‌ కేటాయింపు
* ప్రతి భూకమతాన్ని భూ ఆధార్‌ ద్వారా గుర్తింపు
* ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు
* దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు
* విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.లక్షా 48 వేల కోట్లు
* వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు

* ఐదు పథకాల కోసం PM ప్యాకేజీ
* విద్య, ఉద్యోగాలు నైపుణ్యాల కోసం రూ.2 లక్షల కోట్లు
* ఇందులో ఈ ఏడాదిలో రూ.1.48 లక్షల కోట్లు
* ఉన్నత విద్యారుణాలకు రూ.10 లక్షలు
* ఆఫ్‌షోర్‌ మైనింగ్‌కు నూతన విధానం
* మినరల్‌ మిషన్‌ ద్వారా జాతీయంగా, అంతర్జాతీయంగా కీలక ఖనిజాల గుర్తింపు, ఎగుమతులకు ప్రణాళిక
* ఆఫ్‌షోర్‌ మైనింగ్‌కు నూతన విధానం
* సాగరగర్భంలో ఖనిజ నిక్షేపాల అన్వేషణ, తవ్వకాల కోసం ప్రత్యేక ప్రణాళిక

* బిహార్‌లో రూ.21,400 కోట్లతో 2400 మెగావాట్ల పవర్‌ప్లాంట్‌
* ఎయిర్‌పోర్టులు, మెడికల్‌ కాలేజీలు, స్పోర్ట్స్‌ సదుపాయాలు
* బిహార్‌కు నిధుల కల్పనకు బ్యాంకుల ద్వారా రుణాలు

* పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం
* రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం
* అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు
* ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం
* భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైంది
* ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం
* విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం
* హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
* కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్‌, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు

Read also: Telangana Budget: కొత్త ప్రభుత్వంలో రూ.2,75,897 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. కేటాయింపులు ఎలా ఉన్నాయంటే..
Rail Ticket: మీకు తెలుసా? రైల్లో ఒంటరి మహిళకు టికెట్ లేకున్నా పర్వాలేదు!
BSNL Offers: బీఎస్ఎన్ఎల్ బొనాన్జా.. జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా ఓటీటీ ఆఫర్లు!
CM Revanth Reddy: కమ్మ అంటే అమ్మ లాంటిది.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు