HomeTech NewsWhatsApp: వాట్సప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లు ఎలా చూడాలంటే..

WhatsApp: వాట్సప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లు ఎలా చూడాలంటే..

WhatsApp: ప్రస్తుత రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాట్సాప్ ఉపయోగిస్తుంటారు. దీంతో మెసేజ్ లు, ఫొటోలు, వీడియోలు సులభంగా షేర్ చేసుకోవచ్చు. యాప్ లో కాలింగ్, వీడియో కాలింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

గోప్యతని దృష్టిలో ఉంచుకుని యాప్‌లో అనేక గోప్యతా ఆధారిత ఫీచర్‌లు కూడా అందించబడ్డాయి. అలాంటి ఒక ఫీచర్ డిలీట్ ఫర్ ఎవ్రీవన్. దీని కారణంగా, రిసీవర్, పంపిన వారి చాట్‌ల నుండి మేసేజ్ లు డిలీట్ అయిపోతాయి.

కానీ, ఇది తొలగించిన మేసేజ్ ల జాడను వదిలివేస్తుంది. కొన్ని మేసేజ్ లు పంపినట్లు, తొలగించినట్లు చూపిస్తుంది. చాలా మంది డిలీట్ అయిన సందేశాల్లో ఏముందో తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఇందు కోసం కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి. అయితే, వాటిని ఉపయోగించడం చాలా డేంజర్. అందువల్ల ఆండ్రాయిడ్ (Android) సెల్ ఫోన్‌లలో అందుబాటులో ఉన్న ఇన్-బిల్ట్ ఫీచర్ గురించి అందరూ తెలుసుకోవాలి. దాని ద్వారా తొలగించిన మెసేజ్ లను రీడ్ చేయొచ్చు.

తొలగించిన టెక్స్ట్ మెసేజులు మాత్రమే దీని ద్వారా చెక్ చేయవచ్చు. కానీ, ఫొటోలు లేదా ఆడియో సందేశాలను చూడటం కుదరదు. అలాగే, ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 11, అంతకంటే ఎక్కువ వెర్షన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది.

డిలీట్ అయిన సందేశాలు ఇలా చదవొచ్చు..
* ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి
* తర్వాత నోటిఫికేషన్‌లపై నొక్కాలి
* దీని తర్వాత మరిన్ని సెట్టింగ్‌లకు (More settings) వెళ్లాలి
* ఆపై నోటిఫికేషన్‌ల చరిత్రకు (Notifications history) వెళ్లాలి
* ఆపై స్క్రీన్‌పై కనిపించే టోగుల్‌ను ఆన్ చేయాలి

ఈ ఫీచర్‌ని ఆన్ చేసిన తర్వాత, మీరు మళ్లీ Notifications ద్వారా హిస్టరీకి వెళ్తారు. దీని ద్వారా మీరు 24 గంటల్లో డిలీట్ అయిన టెక్స్ట్ సందేశాలను చదవొచ్చు.

ఇవీ చదవండి: Vote: ఓటు వేసేందుకు ఆధార్‌ తప్పనిసరి కాదు.. కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత
Find My Device: నెట్‌వర్క్‌ లేకున్నా, బ్యాటరీ డెడ్‌ అయినా మీ ఫోన్‌ను కనిపెట్టొచ్చు! ఫైండ్‌ మై డివైజ్‌ అప్‌గ్రేడ్‌..!
WhatsApp: ఆధార్, పాన్‌ కార్డు వాట్సప్‌లో డౌన్‌లోడ్‌ చేసేయండి!
Child Aadhar: బ్లూ ఆధార్‌.. బాల ఆధార్‌.. ఎలా తీసుకోవాలి?
Budget 2024: కేంద్ర బడ్జెట్ విశేషాలు.. 2024-25లో కేటాయింపులు, ఖర్చులు ఇవీ!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు