HomeBusinessBSNL Offers: బీఎస్ఎన్ఎల్ బొనాన్జా.. జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా ఓటీటీ ఆఫర్లు!

BSNL Offers: బీఎస్ఎన్ఎల్ బొనాన్జా.. జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా ఓటీటీ ఆఫర్లు!

BSNL Offers: ప్రముఖ నెట్ వర్క్ సంస్థలైన జియో, ఎయిర్ టెల్ కంపెనీలు ఇటీవల టారిఫ్ రేట్లను భారీగా పెంచిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలువురు వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ (BSNL) వైపు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. లక్షలాది మంది కస్టమర్లు జియో, ఎయిర్ టెల్ నుంచి బీఎస్ఎన్ఎల్ కు ఇప్పటికే పోర్ట్ పెట్టుకుని మారిపోయారు. ఈ కోవలో మరికొందరు రెడీగా ఉన్నారు. తక్కువ ధరలకే బీఎస్ఎన్ఎల్ సేవలు, డేటా వస్తుండటంతో జియో, ఎయిర్ టెల్ నుంచి మారిపోతున్నారు. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ మరో భారీ ఆఫర్ తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ముందుకొచ్చింది.

ఇండియాలో జియో, ఎయిర్‌టెల్ లాంటి ప్రధాన టెలికాం సంస్థలు ప్రముఖ నగరాలన్నింటిలో హై-స్పీడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్నాయి. ఇందులో పలు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తాయి. ఈ ప్లాన్స్ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. జియో, ఎయిర్‌టెల్ మాదిరిగానే బీఎస్ఎన్ఎల్ కూడా ఓటీటీ వైపు లుక్కేసింది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్‌ను వాడే వినియోగదారులు ఇకపై జీ-5, సోనీ లివ్, యప్ టీవీ, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, షీమారోమీ, హంగామా, లయన్స్ గేట్ ప్లే, ఎపిక్ ఆన్ లాంటి పలు ఓటీటీ వేదికలకు సబ్‌స్క్రిప్షన్లను పొందే వీలుంది.

అయితే బీఎస్ఎన్ఎల్ ఓటీటీ ప్లాన్‌లు స్వతంత్ర ప్లాన్‌లుగా అవైలబుల్ ఉంటాయి. అంటే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు అవసరమైన వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న టారిఫ్ లను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లు రూ. 49 నుంచి మొదలలై రూ. 250 వరకు ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ఆఫర్లను సినిమా ప్లస్ అని పేరు పెట్టారు.

బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ సేవలు ఇవీ..
సినిమా ప్లస్ తో వివిధ ఓటీటీ వేదికలకు మెంబర్ షిప్ లను అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా లభించే సేవలను పీసీ/ల్యాప్‌టాప్, మొబైల్, ట్యాబ్, స్మార్ట్ టీవీలతో సహా ఏ టైమ్ లో అయినా, ఎక్కడైనా చూసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న ప్యాక్ ఆధారంగా అన్ని ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు బీఎస్ఎన్ఎల్ ఫైబర్ కనెక్షన్‌కు సంబంధించిన రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌లో యాక్టివేట్ అవుతాయి. వినియోగదారుల బిల్లులో డబ్బులు వసూలు చేస్తారు.

ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే..
సినిమా ప్లస్ ప్లాన్ రూ. 49 కింద కస్టమర్లు షేమారో, హంగామా, లయన్స్‌గేట్, ఎపిక్ ఆన్ వేదికలను లాగిన్ పొందవచ్చు. ఇక సినిమా ప్లస్ రూ.119 ప్లాన్ కింద జీ-5 ప్రీమియం, సోనీ లివ్ ప్రీమియం, యప్ టీవీ, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లను వీక్షించవచ్చు. మరోవైపు సినిమా ప్లస్ ప్లాన్ రూ.249 కింద జీ-5 ప్రీమియం, సోనీ లివ్ ప్రీమియం, యప్ టీవీ, షీమారో, హంగామా, లయన్స్ గేట్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ యాప్స్‌ను మీ డివైజ్ లలో వీక్షించవచ్చు.

ఇవీ చదవండి: Airtel: మోత మోగించిన ఎయిర్‌టెల్.. టారిఫ్‌లు ఎంత పెరిగాయంటే..!
CM Revanth Reddy: కమ్మ అంటే అమ్మ లాంటిది.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Types of Emotions: మనిషి జీవితంలో భావోద్వేగాలు ఎన్ని రకాలు?
Tripti Dimri: బాలీవుడ్‌లో ఎంత మంది అందగత్తెలున్నా.. త్రిప్తి డిమ్రీ అందం వేరయా!
Puja Khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు భారీ షాక్..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు