Rail Ticket: రైల్లో టికెట్ లేకుండా జర్నీ చేస్తే ఏమవుతుంది? టీసీకి కనిపిస్తే ఫైన్ వేస్తారు. రైలు నుంచి దింపేస్తారు. కానీ కొందరికి ఈ తరహా విధానాల నుంచి ఉపశమనం ఉందట. ఇండియన్ రైల్వేస్ తాజాగా కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఒంటరిగా ప్రయాణించే మహిళల కోసం ప్రత్యేక రక్షణ చట్టాలను అమలు చేస్తోంది రైల్వే శాఖ. ఈ చట్టాలపై అందరూ అవగాహన కల్పించుకోవాలి. ముఖ్యంగా మహిళలు వీటిపై అవగాహన కలిగి ఉండాలి.
1989లో రూపొందించిన భారతీయ రైల్వే చట్టంలోని సెక్షన్ 139.. ఒంటరి మహిళా ప్రయాణికులకు, ముఖ్యంగా పిల్లలతో ప్రయాణించే వారికి రక్షణ ఇస్తుంది. ఈ చట్టం ప్రకారం, ఓ మహిళ తన బిడ్డతో ఒంటరిగా రైల్లో ప్రయాణం చేస్తుంటే టిక్కెట్ లేదా పాస్ లేకపోతే, ఆమెను రాత్రిపూట రైలు నుంచి దిగాలంటూ బలవంతం చేయరాదు. రైలు ప్రయాణాల సమయంలో మహిళా ప్రయాణికులు, వారి పిల్లల భద్రత కోసం రైల్వే శాఖ ఈ నియమాన్ని తీసుకొచ్చింది.
టికెట్ లేకున్నా నో ప్రాబ్లమ్
సింగిల్ గా ప్రయాణాలు చేసే టీనేజ్ అమ్మాయి లేదా మహిళకు టికెట్ లేకపోతే, వారిని రైలు నుంచి దించేసే అధికారం టీటీఈకి ఉండదని ఇండియన్ రైల్వేస్ స్పష్టం చేసింది. వారి వద్ద డబ్బు ఉంటే, ఫైన్ కట్టి ప్రయాణం చేసుకోవచ్చు. మహిళ లేదా టీనేజ్ అమ్మాయి దగ్గర డబ్బు లేని సందర్భాల్లో, టీటీఈ వారిని కంపార్ట్‌మెంట్ నుంచి దింపేయరాదు.
మహిళల సేఫ్టీకి ఇవీ నిబంధనలు
మహిళల కోసం లాంగ్ డిస్టెన్స్ మెయిల్/ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ స్లీపర్ క్లాస్‌లో ఆరు బెర్తులు రిజర్వ్ ఉంటాయి. అలాగే గరీబ్ రథ్/రాజధాని/దురంతో/ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని థర్డ్-టైర్ AC (3AC) కోచ్‌లలో 6 బెర్తులు వీరి కోసం రిజర్వ్ చేశారు. వయసుతో సంబంధం లేకుండా, ఒంటరిగా లేదా గుంపుగా ప్రయాణిస్తున్నారా అనే అంశాలతో సంబంధం లేకుండా మహిళలకు ఈ నిబంధనలు తోడుగా ఉంటాయి.
భారతీయ రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 311 ప్రకారం సైనికులు, సంబంధిత స్టాఫ్ మహిళల కంపార్ట్‌మెంట్లలోకి ప్రవేశించరాదు. అలాగే అధికారులతో పాటు ఒక మహిళా కానిస్టేబుల్ ఉన్నప్పుడు మాత్రమే ఒక మహిళను రైలు నుంచి బయటకు వెళ్లిపోవాల్సిందిగా సూచించవచ్చు. ఇక సెక్షన్ 162 ప్రకారం, 12 ఏళ్లలోపు అబ్బాయిలు మహిళల కంపార్ట్‌మెంట్లలో జర్నీ చేయవచ్చు. మహిళల కోచ్‌లోకి అక్రమంగా వెళ్లే పురుషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.
రైళ్లలో జర్నీ చేసే ఉమెన్ కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుంటుంది. 2020 అక్టోబర్ 17న ‘మేరీ సహేలి’ అనే పాన్ ఇండియా ప్రోగ్రామ్ ను ఆర్పీఎఫ్ మొదలుపెట్టింది. మహిళా ప్రయాణికులకు, ప్రత్యేకించి ఒంటరిగా వెళ్లే వారికి భద్రత ఇవ్వడం ఈ కార్యక్రమ ఉద్దేశం. ఇటీవల భారతీయ రైల్వే స్టేషన్లలో సీసీటీవీలు, మానిటరింగ్ గదులను పెంచుతున్నారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.
ఇవీ చదవండి: Puja Khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు భారీ షాక్..
Black Rice: బ్లాక్ రైస్ తింటే గుండె ఆరోగ్యం మెరుగవుతుందని మీకు తెలుసా?
Indian style Biryani: ఇండియన్ స్టైల్ చికెన్ ఫ్రై బిర్యానీ.. తప్పక ట్రై చేయండి!
Lust Stories 2: మరోసారి తమన్నా బోల్డ్ యాక్టింగ్.. లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్‌లో విజయ్ వర్మతో రొమాన్స్!
Mobile Theft: మొబైల్ ఫోన్లు కొట్టేయటానికి శిక్షణ.. ట్రైనింగ్ పూర్తి చేసుకుంటే రూ.25 వేల జీతం..! గుట్టు రట్టయ్యిందిలా..!
