HomeLife StyleSun Stroke: వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? నీళ్లు తాగించరాదు!!

Sun Stroke: వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? నీళ్లు తాగించరాదు!!

Sun Stroke: వేసవి కాలం ముగుస్తున్నా తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో వేడి మాత్రం తగ్గడం లేదు. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది వడదెబ్బ బారిన పడుతున్నారు. అయితే వడదెబ్బ తగిలిన సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

వడదెబ్బ తగిలితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆ సమయంలో చేయకూడనివి ఏంటో కూడా పేర్కొంది. వడదెబ్బ తగిలి స్పృహ కోల్పోయిన వ్యక్తికి చాలా మంది వెంటనే నీళ్లు తాగించే ప్రయత్నం చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఎవరైనా స్పృహలో లేనప్పుడు నీళ్లు తాగించకూడదని స్పష్టం చేసింది. వేడి గాలులు వీచే సందర్భాల్లో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.

వడగాలులు తీవ్రతరం అయిన సందర్భాల్లో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. వడగాలులతో ఎప్పుడైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే రీహైడ్రేట్ అయ్యేందుకు నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. వదులుగా ఉన్న దుస్తులే ధరించాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశానికి తరలించాలి. శరీరం అంతా కోల్డ్ స్పాంజింగ్ చేపట్టాలి. స్పృహలో లేకపోతే మాత్రం బలవంతంగా నీళ్లు తాగించే ప్రయత్నం అసలు చేయకూడదు.

నీళ్లు ఎందుకు తాగించవద్దంటే..
మామూలుగా స్పృహలో లేని వ్యక్తి నీళ్లు మింగే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు బలవంతంగా నీళ్లు తాపించే ప్రయత్నం చేస్తే అవి నేరుగా కడుపులోకి కాకుండా ఊపిరితిత్తుల్లోకి చేరుతాయి. అదే జరిగితే న్యుమోనియా వచ్చే ఆస్కారం ఉంటుంది. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది ఏర్పడుతుంది. ఇలాంటి స్థితిలో నీళ్లు తాగిస్తే రక్తనాళాల్లో ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా గుండె కొట్టుకునే తీరు మారుతుంది. ఆ తర్వాత ఫిట్స్ వచ్చే ప్రమాదం లేకపోలేదు. పైగా ఇలా నోటి ద్వారా నీళ్లు అందించి రీహైడ్రేషన్ చేయాలని చూస్తూ కూర్చుంటే ఫస్ట్ ఎయిడ్ అక్కడితోనే ఆగిపోతుంది.

వైద్యం అందించడానికి ఆలస్యమైపోతుంది. ఇది పూర్తిగా ఆ వ్యక్తి కోమాలోకి వెళ్లే ప్రమాదానికి దారి తీస్తుంది. వడదెబ్బ తగిలినప్పుడే కాకుండా ఓ వ్యక్తి ఎప్పుడు ఇలా స్పృహ కోల్పోయినా బలవంతంగా నీళ్లు ఇవ్వకూడదని డాక్టర్లు సైతం చెబుతున్నారు. స్పృహ కోల్పోయిన వ్యక్తి కోమాలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గాలి, వెలుతురు ఎక్కువగా వచ్చే చోట ఆ వ్యక్తిని ఉంచాలి. తలను నెమ్మదిగా ఓ వైపు వాల్చాలి. ఆ వ్యక్తి శ్వాస తీసుకుంటున్నాడా లేదా చూడాలి. ఏదైనా సమస్య అనిపిస్తే వెంటనే సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడాలి.

ఇవీ చదవండి: Sabja Ginjalu: పరగడుపున సబ్జా గింజలతో ఇలా చేస్తే మీ ఆరోగ్యం పదిలం!
Andhra Pradesh Election: చివరి 72 గంటల్లో పోలింగ్ ఏర్పాట్లు ఎలా చేస్తారో తెలుసా?
Kerala Schools: స్కూలు విద్యార్థులకు నీళ్ల విరామం.. కేరళ సర్కారు వినూత్న ఆలోచన!
Hot weather care: ఎండ వేడిమికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
Summer Precautions: వేసవి వచ్చేస్తోంది.. బీ కేర్‌ఫుల్‌.. ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు