HomeLife StyleWeight Loss Foods: బరువు తగ్గిపోవాలా? ఈ ఆహారాలను తినకండి!!

Weight Loss Foods: బరువు తగ్గిపోవాలా? ఈ ఆహారాలను తినకండి!!

Weight Loss Foods: ఈ మధ్య కాలంలో అధిక బరువు సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. జీవనశైలి కారణంగా ఆహారపు అలవాట్లు మారడం అధిక బరువుకు కారణం అవుతోంది. అంతేనా.. పని తగ్గిపోవడం, ఇంట్లో ఖాళీగా ఎక్కువ సమయం కూర్చుని సెల్ ఫోన్ చూస్తూ గడిపేసే వారికి బరువు సమస్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుత రోజుల్లో ఊబకాయం అతి పెద్ద సమస్యగా ఉంది. ఆకలిగా ఉందని ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది తినే కారణంగా బరువు పెరిగిపోతున్నారు. అతిగా తింటూ, ఎలాంటి శారీరక శ్రమ చేయకుంటే గ్యారెంటీగా ఊబకాయం వస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. బరువు తగ్గాలంటే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

కొందరు జెనెటిక్ గా బరువు పెరుగుతుంటారు. మరికొందరు మాత్రం తినడం వల్ల లావు అవుతారు. చాలా మంది హెవీగా తిని ఎలాంటి వ్యాయామం చేయకుండా ఉంటారు. దీనివల్ల శరీర బరువు బాగా పెరుగుతుంది. కానీ బరువు పెరగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి బరువు పెరగకుండా ఉండటానికి కొన్ని రకాల ఫుడ్స్ ను అవాయిడ్ చేయాలి.

బంగాళదుంప
ఆలుగడ్డ కూడా మీరు బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. బంగాళదుంప ఫ్రైలు, బంగాళాదుంప చిప్స్, సమోసాలు అంటూ వివిధ మార్గాల్లో తింటే మీరు బరువు ఎక్కువ పెరుగుతారు. బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ బరువను పెంచుతాయి. అందుకే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే వీటిని మాత్రం అవాయిడ్ చేయండి.

జంక్ ఫుడ్స్
జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ బలే టేస్టీగా ఉంటాయి. అందుకే చాలా మంది ప్రతి రోజూ పిజ్జా, బర్గర్స్ వంటి జంక్ ఫుడ్స్ ను ప్రతిరోజూ తింటుంటారు. కానీ ఈ ఆహార పదార్థాలను ఎక్కువగా తింటే బరువు పెరిగిపోతారు. వీటిని తింటే మీరు బరువు తగ్గే ప్రసక్తే ఉండదు.

స్వీట్స్
స్వీట్స్ ను ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. చాలా మందికి ఉదయం, సాయంత్రం వేళల్లో స్వీట్లను తినే అలవాటు పక్కాగా ఉంటుంది. కానీ స్వీట్లు ఆరోగ్యానికి అంత మంచివి కాదు. ప్రతి రోజూ మీరు స్వీట్లను తింటే బ్లడ్ షుగర్ పెరగడంతో పాటుగా బరువు కూడా బాగా పెరుగుతారు. మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం స్వీట్లను తినడం మానేయాలి.

కూల్ డ్రింక్స్
ఇప్పుడు వేసవి కాలం ముగిసినప్పటికీ ఎండలు, వేడి చాలా ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. దాహాన్ని తీర్చుకోవడానికి చాలా మంది ప్రతిరోజూ కోకాకోలా, సోడాలు వంటి శీతల పానీయాలను లాగించేస్తుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావన్న విషయం గమనించాలి. ఇవి ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా మీ బరువును కూడా బాగా పెంచుతాయి. అందుకే బరువు తగ్గాలనుకుంటే మాత్రం వీటిని దూరం పెట్టండి.

చాక్లెట్
చాక్లెట్ అంటే చాలా మందికి ఇష్టం. వీటిని పిల్లలు, ఆడవాళ్లు చాలా ఇష్టంగా తింటుంటారు. ఒకేసారి వీటిని చాలా కొనేసి వీలున్నప్పుడల్లా తినడం చేస్తుంటారు. కానీ చాక్లెట్ ను ఎక్కువగా తినడం వల్ల బాగా బరువు పెరిగిపోతారు.

ఇవీ చదవండి: Cow milk: బరువు తగ్గాలా? ఆవు పాలు మంచిదా? గేదె పాలు మంచిదా?
Ascaris lumbricoides: పిల్లలు బరువు పెరగడం లేదా? నీరసంగా ఉన్నారా? నులిపురుగుల నివారణ ఇలా..
Weight Loss: బరువు తగ్గడంలో ఈ రూల్‌ గురించి మీకు తెలుసా? 30-30-30 అంటే ఏమిటి?
Weight lose home remedies: ఇంటి చిట్కాలతో బరువు తగ్గడం ఎలా?
Skipping: స్కిప్పింగ్ చేస్తే బరువు తగ్గుతారా? లాభాలు తెలుసుకోవాలా? అయితే ఈ కథనం మీకోసమే!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు