HomeLife StyleBelt: టైటుగా ఉండే బెల్ట్‌తో అనారోగ్య సమస్యలు ఖాయం..!

Belt: టైటుగా ఉండే బెల్ట్‌తో అనారోగ్య సమస్యలు ఖాయం..!

Belt: నేటి కాలంలో యువత మొదలుకొని పెద్ద వారి వరకు ప్యాంటు వేసుకుంటే బెల్ట్‌ కంపల్సరీ ధరిస్తుంటారు. రకరకాల ఫ్యాషన్‌ కలిగిన దుస్తుల్లోకి అంతే ఫ్యాషన్‌గా ఉండే బెల్టు ధరిస్తుంటారు. ఇప్పుడు బెల్టు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారింది. అసవరం ఉన్నా లేకున్నా.. ఏ డ్రెస్ మీద అయినా ధరిస్తున్నారు. పురుషులు మాత్రమే కాదు.. స్త్రీలు కూడా బెల్టు పెట్టుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో అందరూ స్టైల్ గా కనపడటానికి ఇష్టపడుతున్నారు.

టైట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల నరాల సమస్య ఏర్పడుతుంది. ఇది నడుము లేదా పొత్తికడుపులో తిమ్మిరిని ఏర్పరుస్తుంది. టైట్ బెల్ట్ ధరించడం వల్ల రక్తనాళాల్లో రక్త సరఫరా జరగదు. దీని వల్ల ఉదర కండరాలు పనిచేయడం మానేస్తుంది. బిగుతుగా ఉండే బెల్ట్ ధరించడం వల్ల గుండెల్లో మంట , యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువ కావచ్చు, నిజానికి, బిగుతుగా ఉండే బెల్ట్ మీ కడుపుపై ఒత్తిడి తెస్తుంది, దీనివల్ల పొట్టలోని ఆమ్లం గొంతులోకి చేరుతుంది. ఇది ఎసిడిటీ సమస్యలను తెచ్చిపెడుతుంది. టైట్ బెల్ట్ ధరించడం వల్ల కటి ప్రాంతంపై ఒత్తిడి వస్తుంది. ఇది పునరుత్పత్తి అవయవాలను ఎఫెక్ట్‌ చేస్తుంది. సంతానోత్పత్తిపై ప్రభావం పడేలా చేస్తుంది. అంటే గర్భం దాల్చే అవకాశాలను దెబ్బతీస్తుంది.

స్త్రీ, పురుషులిద్దరూ ఈ కాలంలో జీన్స్ ప్యాంటు ధరిస్తున్నారు. కొందరు బెల్ట్ లేకుండా జీన్స్ ధరిస్తే, కొందరు ప్యాంట్ ఫిట్టింగ్‌ను నిర్వహించడానికి బెల్ట్‌ను పెట్టుకుంటారు. కొందరికి బెల్టులు చాలా టైట్ గా ధరించే అలవాటు కూడా ఉంటుంది. మీరు కూడా ఇలా చేస్తే, ఈ రోజు నుండి ఈ అలవాటును మార్చుకోవాలి. దీని వలన మీరు చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. బెల్ట్ మాత్రమే కాదు, ప్యాంటును చాలా గట్టిగా కట్టుకోవడం వల్ల చాలా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

బిగుతుగా ఉండే బెల్టులు ధరించడం మూలాన వెన్నెముక కూడా ప్రభావితం అవుతుంది. దీని కారణంగా మీరు వెన్నునొప్పికి గురవుతారు. సిస్టిక్ నాడి, అనేక ఇతర నరాలు మీ నడుము చుట్టూ వెళ్తాయి. ఇది ఒత్తిడి కారణంగా మీ శరీరానికి డేంజర్. ఇది మీ పాదాలు ఉబ్బడానికి కారణం అవచ్చు. బిగుతుగా ఉండే బెల్టులు ధరించడం వల్ల వెన్నెముక దృఢత్వం వస్తుంది. ఇది గురుత్వాకర్షణ కేంద్రాన్ని కూడా మారుస్తుంది, మోకాలి కీళ్లపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వల్ల భవిష్యత్తులో మెకాలి నొప్పులు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

ఇవీ చదవండి: AP Elections: ఎన్నికల్లో ఏకపక్ష తీర్పులు దేనికి సంకేతం?! చరిత్ర చెబుతున్న సత్యం..!
Andhra Pradesh BJP: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ’మెగా‘ ‘పవర్?’
Chandrababu Food: చంద్రబాబు బతకడానికి ఏం తింటారో తెలుసా? ఫుడ్ డైట్ ఇదీ..
Roads: రోడ్లపై గుంతలా? దానంతట అదే పూడుకుపోయే టెక్నాలజీ వచ్చేస్తోంది!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు