HomeAndhra PradeshChinna News: సంక్షిప్త వార్తలు... ఖరీఫ్ కోసం సబ్సిడీపై 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాలు

Chinna News: సంక్షిప్త వార్తలు… ఖరీఫ్ కోసం సబ్సిడీపై 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాలు

Chinna News: ఖరీఫ్ కోసం సబ్సిడీపై 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేసినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. విత్తనాల పంపిణీకి ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చింది. రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లకు వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం జగన్‌ సర్కార్ రూ.450 కోట్లు ఖర్చు చేస్తోంది.
———-
రెండోరోజు ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు
రెండోరోజు బైపీసీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉ.9 గంటల నుంచి 12గంటల వరకు ఒక సెషన్ ఉంటుంది. మ.2.30 నుంచి సా.5.30 వరకు రెండో సెషన్ ఉంటుంది. రేపటి నుంచి 23 వరకు ఎంపీసీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆన్ లైన్ మోడ్ లో పరీక్షల నిర్వహణ ఉంటుంది. విద్యార్థులకు ఒక నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు.
————
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
కలియుగ వైకుంఠం శ్రీవారి చెంత భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 76,369 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.63 కోట్లు చేకూరింది.
———–
తిరుమలలో నేటి నుంచి శ్రీపద్మావతి పరిణయోత్సవాలు
తిరుమలలో ఇవాళ్టి నుంచి శ్రీపద్మావతి పరిణయోత్సవాలు జరుగుతున్నాయి. నారాయణగిరి ఉద్యానవనంలో పరిణయోత్సవాలు కొనసాగుతాయి. మూడు రోజులపాటు వైభవంగా పరిణయోత్సవాలు జరుగుతాయి. తొలిసారి కేరళ సంప్రదాయ అలంకరణ ‘తెప్పకోలం’ కనువిందు చేయనుంది. ఉత్సవాల సందర్భంగా పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

ఇవీ చదవండి: Rains in AP: ద్రోణి ప్రభావంతో రెండు రోజులు ఏపీలో మోస్తరు వర్షాలు
Elections: దేశ వ్యాప్తంగా తొలి నాలుగు దశల్లో 66.95 శాతం ఓటింగ్‌ నమోదు
E-Office: ఈ-ఆఫీస్‌ వ్యవస్థలో కీలక ముందడుగు.. మరింత మెరుగుపరిచేలా అప్‌గ్రెడేషన్‌
Double ISMART: డబుల్‌ ఇస్మార్ట్ టీజర్‌ వచ్చేసింది.. ఈసారి డబుల్‌ మాస్ గ్యారెంటీ!
YS Jagan in Repalle: ఈ ఎన్నికలు.. ఐదేళ్ల పేదల భవిష్యత్తును నిర్దేశించబోతున్నాయి రేపల్లెలో సీఎం జగన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు