HomeAndhra PradeshRains in AP: ద్రోణి ప్రభావంతో రెండు రోజులు ఏపీలో మోస్తరు వర్షాలు

Rains in AP: ద్రోణి ప్రభావంతో రెండు రోజులు ఏపీలో మోస్తరు వర్షాలు

Rains in AP: ఏపీలో వానలు పడుతున్నాయి. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ వానలు పడతాయన్నారు. ఇక మన్యం, అల్లూరి, ప.గో., కోనసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.

రేపు ఎన్టీఆర్, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో మోస్తరు వానలు కురవనున్నాయి. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయి. కోనసీమ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోనూ వర్షాలు కురిసే చాన్స్‌ ఉంది. రేపు పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయి. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్ లో పలుప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరాన్ని వాన ముంచెత్తింది. అత్యధికంగా సికింద్రాబాద్ లో 9.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మలక్ పేట 8.4 సెం.మీ, బంజారాహిల్స్ 8.3 సెం.మీ. వర్షపాతం కురిసింది. బేగంబజార్ 8.1సెం.మీ, గోల్కొండ 7.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కృష్ణానగర్ 7.4 సెం.మీ, అస్మాన్ ఘడ్ 7.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

తమిళనాడులో భారీ వర్షాలు
దక్షిణ తమిళనాడులో 6 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చెంగల్ పట్టులో భారీ వర్షాలకు చెట్లు విరిగిపడ్డాయి. తిరువళ్లూరులో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

పశ్చిమ బెంగాల్ లోని మాల్డా జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. మాల్డా జిల్లాలో పిడుగుపాటుకు 11 మంది మృతి చెందారు. వర్షాలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం ఏర్పడింది.

ఇవీ చదవండి: Mannara Chopra: వర్షంలో డ్యాన్స్.. మన్నారా చోప్రాపై దారుణమైన ట్రోలింగ్
Nigeria Jail: నైజీరియాలో భారీ వర్షాలకు కూలిన జైలు.. 118 మంది ఖైదీలు పరార్‌
Weather Report today 07-09-2023: కోస్తా, రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు