HomeTelanganaTelangana: ఎన్‌కౌంటర్లపై మావోయిస్టుల లేఖ విడుదల

Telangana: ఎన్‌కౌంటర్లపై మావోయిస్టుల లేఖ విడుదల

Telangana: ఎన్ కౌంటర్లపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. బీకేఏఎస్ ఆర్ కార్యదర్శి ఆజాద్ పేరుతో లేఖ విడుదలైంది. ఛత్తీస్ గఢ్ లో ఫేక్ ఎన్ కౌంటర్లు చేస్తున్నారని అందులో మండిపడ్డారు. ఆదివాసీలను చంపి ఎన్ కౌంటర్లుగా చిత్రీకరిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. మూడు నెలల్లో 103 మందిని ఎన్ కౌంటర్ చేశారని ప్రస్తావించారు. వారిలో 60 మంది మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారని తెలిపారు. ఆదివాసీ గ్రామాలపై డ్రోన్ల దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. లేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని లేఖలో ఆజాద్ హెచ్చరించారు.
———-
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు
వరంగల్ లో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. సహాయక చర్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ 18004251980, 970199646 కు సంప్రదించాలని అధికారులు కోరారు.
———–
జగిత్యాల జిల్లాలో దారుణం
శ్రీను అనే వ్యక్తిని దుండగులు కర్రలతో కొట్టిచంపిన ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. అడ్డుకున్న సోదరుడికి తీవ్రగాయాలయ్యాయి. భూతగాదాల నేపథ్యంలో హత్యజరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తన్నారు. బుగ్గారం మండలం గోపులాపూర్ లో ఘటన జరిగింది.
—————–
కూకట్ పల్లి శేషాద్రినగర్ లో డ్రగ్స్ కలకలం
కూకట్‌పల్లిలోని శేషాద్రి నగర్‌లో 3 గ్రాముల MDMA డ్రగ్ ను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిన ఇంటరాగేట్ చేస్తున్నారు. బెంగళూరు నుంచి డ్రగ్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. జగద్గిరిగుట్టలో కూడా మరో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. 3 గ్రాముల MDMA డ్రగ్ ను పోలీసులు సీజ్ చేశారు.

ఇవీ చదవండి: Chinna News: సంక్షిప్త వార్తలు… ఖరీఫ్ కోసం సబ్సిడీపై 6.19 లక్షల క్వింటాళ్ల విత్తనాలు
Rains in AP: ద్రోణి ప్రభావంతో రెండు రోజులు ఏపీలో మోస్తరు వర్షాలు
Elections: దేశ వ్యాప్తంగా తొలి నాలుగు దశల్లో 66.95 శాతం ఓటింగ్‌ నమోదు
Telangana: తెలంగాణలో రెండు వారాలపాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేత
Double ISMART: డబుల్‌ ఇస్మార్ట్ టీజర్‌ వచ్చేసింది.. ఈసారి డబుల్‌ మాస్ గ్యారెంటీ!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు