Andhra Pradesh: ప్రభుత్వాసుపత్రుల్లో రోగుల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్ని ఏబీడీఎంతో లింక్ చేయడంవల్ల అన్ని విధాలుగా ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్, ఎన్ హెచ్ఎం ఏపీ మిషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా చినకాకాని హాయ్ ల్యాండ్ లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్(ABDM) ఆరు రోజుల పాటు నిర్వహించిన మాస్టర్ ట్రైనర్లకు శిక్షణా కార్యక్రమం ముగిసింది.
ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కమీషనర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ మాస్టర్ ట్రైనర్లకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాశ్చాత్య దేశాలు డిజిటలైజేషన్ వైపు పరుగులతీస్తున్న ప్రస్తుత తరుణంలో మనం కూడా ఆ దిశగా పయనించాల్సిన అవసరముందన్నారు.
వందకు వంద శాతం ఆన్లైన్ విధానంలోకి వెళ్లాలన్నారు. దేశమతంతా డిజిటల్ యుగం వైపు చూస్తోందన్నారు. దక్షిణ ఆసియా దేశాలు డిజిటలైజేషన్ లో పూర్తి సామర్థ్యాన్ని ఏర్పరుచుకున్నాయన్నారు. ఎబిడిఎం పై ప్రతి రెండు వారాలకోసారి సమీక్షిస్తానన్నారు. స్టేట్ నోడల్ ఆఫీసర్ బీవీ రావు నేతృత్వంలో ఎబిడిఎం బృందం సమర్ధవంతంగా పనిచేస్తోందన్నారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. రోగుల డిజిటల్ వివరాల్ని ఏకీకరణ చేయాలన్నారు. తద్వారా పరీక్షించే డాక్టర్లకు సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు.
ఎబిడిఎం, ఎన్ఐసి సమన్వయంతో ఈనెల 15, 16 తేదీలలో సెకండరీ హెల్త్ డైరెక్టరేట్(గతంలో ఎపివివిపి) పరిథిలో పనిచేస్తున్న
డాక్టర్లు, నర్సులు, ఫార్మాసిస్టులు , ల్యాబ్ టెక్నీషియన్లకు డిస్ట్రిక్ట్ మాస్టర్ ట్రైనర్లుగా రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఈనెల 22 నుండి నాలుగు రోజుల పాటు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ పరిధిలోని జిజిహెచ్ లు , టీచింగ్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఫార్మాసిస్టులు , ల్యాబ్ టెక్నీషియన్లకు డిస్ట్రిక్ట్ మాస్టర్ ట్రైనర్లుగా రెండు రోజుల శిక్షణను రెండు బ్యాచ్ లుగా విభజించి నాలుగు రోజుల పాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం గురువారం నాడు ముగిసింది.
ప్రజారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరిచే విషయంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ ముందుందని కమీషనర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలులో ఏపీ గణనీయమైన విజయాన్ని సాధించిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆరోగ్య సంస్థలలో ఆరోగ్య రికార్డుల డిజిటలైజ్ చేయడంలో ఏపీ దూసుకెళ్తోందన్నా.
హెల్త్ మేనేజ్‌మెంట్ విధానాన్ని అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల(EHR) కోసం ఈ-హాస్పిటల్ (eHospital), నెక్స్ట్ జెన్ ఈ-హాస్పిటల్ (nextgen eHospital) సాఫ్ట్ వేర్ తో కూడిన హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (HMIS) వినియోగిస్తున్నామన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు తమతమ జిల్లాల్లో సమర్ధవంతంగా శిక్షణ ఇవ్వడం ద్వారా ఎబిడిఎంను రాష్ట్రంలో విజయవంతం చేయడంలో మాస్టర్ ట్రైనర్లు కీలకపాత్ర పోషించాలన్నారు.
ఇవీ చదవండి: Apple: రోజుకో యాపిల్ తినడం వల్ల వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన పని లేదు.. ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ..
ST Commission: గిరిజనులకు వారి గ్రామంలోనే ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా మెరుగైన వైద్యం
Everest: ఎవరెస్ట్ పర్వతారోహకులకు వింత అనుభవాలు.. మల వ్యర్థాలతో కంపు కొడుతున్న మంచుకొండలు!
Family Doctor: ఫ్యామిలీ డాక్టర్.. మీ ఇంటి వద్దకే వచ్చి వైద్యం చేస్తాం!
Memantha Siddham Completed: విప్లవాత్మక మార్పుల యుద్ధమే ఈ సిద్ధం.. మరో చారిత్రక విజయానికి సిద్ధం!
