Andhra Pradesh Election: ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి నిన్నటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం చేసుకున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో వచ్చేనెల 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఓటర్లను ప్రలోభపర్చే నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఇతర వస్తువుల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఉంచామన్నారు.
అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులతో పాటు రాష్ట్రంలోని పలు చెక్ పోస్టుల ద్వారాను మరియు పోలీస్, ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్సు, ఫారెస్టు, ఇడి, ఎన్సీబి, ఆర్పిఎఫ్, కస్టమ్స్ తదితర 20 ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలకు పైబడి ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల అక్రమ రవాణాపై నిరంతరం నిఘా కాస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫలితంగా ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం చేసుకున్నామన్నారు.
కేవలం గత 24 గంటల్లోనే రూ.8.65 కోట్ల విలువైన అక్రమ రవాణా ఆస్తులను స్వాదీనం చేసుకోవడం జరిగిందన్నారు. నేటి వరకూ స్వాదీనం చేసుకున్న మొత్తం రూ. 165.91 కోట్లలో అత్యధిక మొత్తం రూ.30.66 కోట్లు అనంతపూర్ పార్లమెంటరీ నియోజక వర్గంలోనూ అత్యల్పంగా రూ.1.15 కోట్లు నర్సాపురం పార్లమెంటరీ నియోజక వర్గంలోను స్వాదీనం చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.
స్వాదీనం చేసుకున్న మొత్తం సొమ్ములో రూ.36.89 కోట్లు నగదు, రూ.20.32 కోట్ల విలువైన 6,62,402.65 లీటర్ల లిక్కరు, రూ.2.78 కోట్ల విలువైన 52,28,218.94 గ్రాముల డ్రగ్స్, రూ.91.26 కోట్ల విలువైన 14,73,734.46 గ్రాముల ప్రెషస్ మెటల్, రూ.2.90 కోట్ల విలువైన 4,88,557 ఫ్రీ బీస్ (ఉచితాలు) మరియు రూ.11.74 కోట్ల విలువైన 11,27,451.07 ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు.
అత్యధిక మొత్తం రూ.30.66 కోట్లు అనంతపురం పి.సి.లోను, అత్యల్పంగా రూ.1.15 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను నర్సాపురం పి.సి.లోను స్వాదీనం చేసుకోవడం జరిగింది. పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా అత్యధికం నుండి అల్యల్పంగా స్వాదీనం చేసుకున్న పార్లమెంటరీ నియోజక వర్గాలు ఇవీ..
* అనంతపురంలో రూ.30.66 కోట్లు, తిరుపతి (ఎస్సీ) లో రూ.19.37 కోట్లు
* కాకినాడలో రూ.18.18 కోట్లు
* ఏలూరులో రూ.13.77 కోట్లు
* విశాఖపట్నంలో రూ.12.50 కోట్లు
* రాజంపేటలో రూ.6.96 కోట్లు
* విజయవాడలో రూ.6.75 కోట్లు
* నంద్యాలలో రూ.5.63 కోట్లు
* కడపలో రూ.5.62 కోట్లు
* నర్సరావుపేటలో రూ.4.61 కోట్లు
* విజయనగరంలో రూ.4.18 కోట్లు
* బాపట్ల (ఎస్సీ)లో రూ.3.99 కోట్లు
* అనకాపల్లిలో రూ.3.72 కోట్లు
* రాజమండ్రిలో రూ.3.62 కోట్లు
* శ్రీకాకుళంలో రూ.3.61 కోట్లు
* అరకు (ఎస్టీ)లో రూ.3.37 కోట్లు
* నెల్లూరులో రూ.3.00 కోట్లు
* మచిలీపట్నంలో రూ.2.87 కోట్లు
* గుంటూరులో రూ.2.75 కోట్లు
* కర్నూలులో రూ.2.45 కోట్లు
* చిత్తూరు (ఎస్సీ)లో రూ.1.94 కోట్లు
* ఒంగోలులో రూ.1.93 కోట్లు,
* హిందూపురంలో రూ.1.63 కోట్లు
* అమలాపురం (ఎస్సీ) లో రూ.1.52 కోట్లు
* నర్సాపురం పి.సి.లో రూ.1.15 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను స్వాదీనం చేసుకున్నామని ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.
ఇవీ చదవండి: YS Jagan Assets: ఎన్నికల అఫిడవిట్‌లో సీఎం జగన్ ఆస్తుల వివరాలు
Andhra Pradesh Elections: స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణ.. అధికారులు ఓర్పుతో వ్యవహరించాలి
Vote: ఓటు వేసేందుకు ఆధార్ తప్పనిసరి కాదు.. కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత
AP DCS Exam: ఏపీలో డీఎస్సీ పరీక్ష వాయిదా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏమన్నారంటే..
Lok sabha elections: లోక్ సభ ఎన్నికలకు నగారా.. తొలి దశ నోటిఫికేషన్ జారీ
