HomeAndhra PradeshAP 10th: పదో తరగతిలో పునః ప్రవేశం పొంది అత్యుత్తమ ప్రతిభ చూపిన 1,071 మంది

AP 10th: పదో తరగతిలో పునః ప్రవేశం పొంది అత్యుత్తమ ప్రతిభ చూపిన 1,071 మంది

AP 10th: గతేడాది 2023లో పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్‌ అయిన 1,071 మంది విద్యార్థులు పదో తరగతిలో పునః ప్రవేశం పొంది ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ఏపీ విద్యా శాఖ తెలిపింది. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ (G.O.Ms.No.50 SE(Gen) Dept. dated 10.06.2023) ను వినియోగించుకొని ఆయా విద్యార్థులు ఈ ఏడాది 22 ఏప్రిల్ న విడుదలైన పదో తరగతి ఫలితాల్లో మెరుగైన మార్కులు సాధించడం విశేషమని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ. ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు.

గతంలో విద్యలో వెనుకబాటుతనం, వైఫల్యాలను ఎదుర్కొన్న సదరు విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన పునః ప్రవేశ నోటిఫికేషన్ చక్కని తోడ్పాటు అందించిందన్నారు. ఆయా విద్యార్థులు పదో తరగతిలో పునః ప్రవేశం పొందడం ద్వారా ఉన్నత స్థాయి తరగతుల సవాళ్లను దీటుగా ఎదుర్కోవడమే గాక మరింత పట్టుదలగా చదివి మార్కుల్లో గణనీయమైన పెరుగుదల చూపించారన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు విద్యార్థులకు సంబంధించి 2023లో పదో తరగతిలో పొందిన మార్కులను, ప్రస్తుతం పొందిన మార్కులకు తేడా చూపిస్తూ వారి ప్రగతిని వివరించారు.

ఇటీవల వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో ఒక విద్యార్థిని (గోప్యతా కారణాల రీత్యా పేరు వెల్లడించడం లేదు) (రోల్ నెంబర్ 2415101830) 505 మార్కులు (84 శాతం) సాధించింది. ఇదే విద్యార్థిని 2023లో కేవలం 266 మార్కులు (44 శాతం) మాత్రమే సాధించిందన్నారు. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన పునః ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్, కొత్త మార్గదర్శకాలు, అవకాశాలను వినియోగించుకొని సదరు విద్యార్థి సక్రమంగా పాఠశాలలో అన్ని తరగతులకు హాజరై, అన్ని సబ్జెక్టులను బాగా చదివి మంచి మార్కులు సాధించడం విశేషమన్నారు.

అదే విధంగా మరో విద్యార్థిని (గోప్యతా కారణాల రీత్యా పేరు వెల్లడించడం లేదు) (రోల్ నెంబర్ 2401200003) ప్రస్తుతం 274 మార్కులు(46 శాతం) మాత్రమే సాధించింది. ఇదే విద్యార్థిని 2023 పదో తరగతి ఫలితాల్లో కేవలం 220 మార్కులు (36%) మాత్రమే సాధించింది. గతంలో ఒక సబ్జెక్ట్ విషయంలో సవాళ్లు ఎదుర్కొన్న సదరు విద్యార్థి ఆ ఒక్క సబ్జెక్ట్ పరీక్ష రాసి, సంబంధిత సబ్జెక్ట్ పై మరింత పట్టు సాధించి గతంలో కన్నా మెరుగైన ప్రతిభ చూపించిందని వెల్లడించారు.

పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ (G.O.Ms.No.50 SE(Gen) Dept. dated 10.06.2023) తో పదో తరగతిలో పునః ప్రవేశం పొంది అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ భవిష్యత్ లో విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రవీణ్ ప్రకాష్ సూచించారు. చదువులో వెనుకబడిన, మార్కుల్లో వైఫల్యం చెందిన విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ తీసుకువచ్చిన ఈ సంస్కరణను వారి భవిష్యత్ కు మంచి మార్గంగా అభివర్ణించారు.

ఇవీ చదవండి: 100 percent GER: ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం జీఈఆర్
TOEFL Exam: టోఫెల్‌ పరీక్ష రాసిన 4,53,265 మంది 3 నుంచి 5వ తరగతి విద్యార్థులు
Kerala Schools: స్కూలు విద్యార్థులకు నీళ్ల విరామం.. కేరళ సర్కారు వినూత్న ఆలోచన!
Foreign Education: విద్యా విధానం టఫ్‌గా ఉండే దేశాలు ఇవీ.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండోయ్‌!
Early Childhood Education: చిన్నారుల విద్యపై యూనిసెఫ్‌ రూపొందించిన ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సు ప్రారంభం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు