HomeLife StyleFake Medicine: నకిలీ మెడిసిన్‌ను ఎలా గుర్తించాలి? అనుమానం వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి?

Fake Medicine: నకిలీ మెడిసిన్‌ను ఎలా గుర్తించాలి? అనుమానం వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి?

Fake Medicine: ప్రస్తుతం నకిలీ మందుల దందా అక్కడక్కడా వెలుగు చూస్తూనే ఉంది. నకిలీ మెడిసిన్‌ గుట్టు రట్టు అంటూ వార్తల్లో చదువుతూ ఉంటాం. మరి నిత్యావసరంగా మారిపోయిన మందుల విషయంలో నకిలీవి తీసుకోవడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే అవుతుంది. ఇలాంటి తరుణంలో మనం మెడికల్ షాపులో తీసుకునే మందులు అసలైనవా? నకిలీవా? అని ఎలా గుర్తించాలి?

మనిషి అనారోగ్యానికి గురయ్యాడని తెలియగానే సంబంధిత మాత్ర వేసుకోవడం చేస్తుంటాం. అయితే, ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఔషధాలే ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఇప్పుడు మార్కెట్లో వస్తున్న నకిలీ ఔషధాలు కొత్త అనారోగ్యాలను తెచ్చి పెడుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ) అధికారులు జరిపిన విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఓ కంపెనీ చాక్‌ పౌడర్‌, గంజితో ఏకంగా యాంటీ బయోటిక్‌ మందులను తయారీ చేసి అమ్మడాన్ని గుర్తించారు.

పేరులోనే తప్పులు గమనించాలి..
నకిలీ మందులుగా అనుమానం వస్తే కంపెనీ లోగో, పేరులో ఉండే తప్పులను మొదట గుర్తించవచ్చు. బ్రాండెండ్‌ కంపెనీల పేరుతో నకిలీ ఔషధాలను రూపొందించి అమ్ముతుంటారు. ఇలాంటి వాటిని కంపెనీ లోగో, పేరులో ఉండే స్పెలింగ్ మిస్టేక్స్‌ గమనించి ఐడెంటిఫై చేయొచ్చు. ఔషధాలకు సంబంధించి ఏమాత్రం డౌట్‌ కలిగినా అసలు ఔషధంతో సరిపోల్చి చూడాలి. ప్యాకింగ్‌లో కూడా సందేహం వచ్చినా నకిలీ ఔషధంగానే పరిగణించాలి.

బార్‌ కోడ్‌, క్యూఆర్‌ కోడ్‌ చెక్ చేయాలి..
మాత్రల పరిమాణంలోనూ తేడాలు గమనించాలి. ఒకవేళ విరిగిపోయినట్లు కనిపించినా ఆ ట్యాబ్లెట్స్‌ నకిలీవని నిర్దారణకు రావొచ్చు. ఇక అంతకు ముందు వాడిన మందుల కంపెనీలతో చూసుకుంటే ధర మరీ తక్కువగా ఉన్నా కూడా ఫేక్‌ మందులుగా గుర్తించాలి. ఇక 300 రకాల అత్యవసర మందులకు కచ్చితంగా బార్‌ కోడ్‌, క్యూఆర్‌ కోడ్‌ ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల్లో ఉంది. క్యూఆర్‌ కోడ్‌ లేకపోతే తప్పకుండా సందేహించాల్సిందే.

ఫిర్యాదు ఇలా..
మాత్రల ప్యాకేజింగ్ సరిగా లేకపోయినా.. సీల్‌ సందేహాస్పదంగా ఉన్నా నకిలీ ఔషధంగా భావించాలి. ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత అలర్జీ, ఇతర సైడ్‌ ఎఫెక్ట్స్‌ లాంటివి ఉన్నా సరే వెంటనే అప్రమత్తం కావాలి. దగ్గర్లో ఉన్న వైద్యులను సంప్రదించాలి. మీకు ఒకవేళ నకిలీ మందులుగా అనుమానం కలిగితే డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800599696 కు ఫిర్యాదు చేయాలి.

ఇవీ చదవండి: CM Review on Health Dept: మందులు అందడంలేదన్న మాట రాకూడదు
Daily Egg: రోజుకో గుడ్డు.. ఆరోగ్యానికి వెరీ గుడ్డు.. ఉడికించిన గుడ్డులో పోషకాలెన్నో తెలుసా?
Garlic: వెల్లుల్లితో అబ్బురపరిచే ప్రయోజనాలు.. వంటలతో పాటు ఆరోగ్యానికీ మంచిది

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు