Credit card: ప్రస్తుతం క్రిడిట్ కార్డులు వాడే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. దాదాపు అన్ని బ్యాంకులూ తమ కస్టమర్లకు క్రిడిట్ కార్డులు ప్రొవైడ్ చేస్తుంటాయి. అయితే, చాలా మంది క్రెడిట్ కార్డులు విధించే చార్జీలపై అవగాహన ఉండదు. క్రెడిట్ కార్డు కంపెనీలు లేదా బ్యాంకులు వివిధ రుసుముల పేరుతో వినియోగదారుల నుంచి చాలా సొమ్ము వసూలు చేస్తాయి.
కొన్ని చార్జీల గురించి బ్యాంక్ లేదా ఏజెంట్లు కూడా వినియోగదారులకు వివరించరు. ఇలా కనపడని చార్జీలు రహస్యంగా మీ జేబును గుల్ల చేస్తాయి. మీరు కూడా క్రెడిట్ కార్డులు వాడుతున్నారా? అయితే ఎలాంటి చార్జీలు పడతాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
జాయినింగ్ ఫీజు, వార్షిక చార్జీ
పలు క్రెడిట్ కార్డులకు మీరు జాయినింగ్ ఫీజు, యాన్యువల్ చార్జీని చెల్లించాల్సి ఉంటుంది. మీరు జాయినింగ్ ఫీజును ఒక్కసారి మాత్రమే చెల్లిస్తారు. అయితే యాన్యువల్ ఫీజు మాత్రం ఏటా చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులను బట్టి వార్షిక చార్జీలు మారుతాయి. అయితే, చాలా బ్యాంకులు ఏటా నిర్ణీత పరిమితిని ఖర్చు చేసిన తర్వాత వార్షిక ఫీజును మినహాయిస్తాయి.
ఫైనాన్స్ చార్జీలు
క్రెడిట్ కార్డు బిల్లును పూర్తిగా చెల్లించకపోతే, మిగిలిన బిల్లుపై సంబంధిత బ్యాంక్ ఫైనాన్స్ చార్జీలు వేస్తుంది. ఈ కారణంగానే నిపుణులు కనీస మొత్తానికి బదులుగా మొత్తం బిల్లును చెల్లించాలని నిపుణులు సూచిస్తున్నారు.
క్యాష్ అడ్వాన్స్ ఫీజు
క్యాష్ అడ్వాన్స్ చార్జీలు క్రెడిట్ కార్డు ద్వారా ఏటీఎం నుంచి డబ్బును విత్‌డ్రా చేయడానికి క్రెడిట్ కార్డు సంస్థ లేదా బ్యాంక్ వసూలు చేసే సొమ్ము. సాధారణంగా ఇది 2.5 శాతం. అటువంటి పరిస్థితిలో మీరు ఏటీఎం నుంచి క్రెడిట్ కార్డులోని డబ్బులు తీయకుండా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
అక్కడ వాడితే సర్‌చార్జ్
క్రెడిట్ కార్డుల ద్వారా పెట్రోల్, డీజిల్ కొట్టించుకోవాలనుకునే వారికి ఆయా క్రెడిట్ కార్డుల కంపెనీలు సర్‌చార్జి వసూలు చేస్తున్నాయని చాలా మందికి తెలియదు. అయితే, కొన్ని బ్యాంకులు కూడా ఈ చార్జీని కొంత పరిమితి వరకు రీఫండ్ చేస్తున్నాయి.
ఫారెక్స్ మార్కప్ ఫీజు
విదేశాల్లో క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపేటప్పుడు కార్డు కంపెనీలు ఫారెక్స్ మార్కప్ ఫీజులను రాబడతాయి. ఈ రుసుం మీ లావాదేవీ మొత్తంలో 3.5 శాతం వరకు ఉంటుంది. అయితే, తక్కువ ఫారెక్స్ మార్కప్ ఫీజులను వసూలు చేసే కొన్ని క్రెడిట్ కార్డ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.
ఇవీ చదవండి: Income Tax: ఈ 5 తప్పులు చేయకండి.. చేస్తే మీకు ఐటీ నోటీసులు గ్యారెంటీ!
edX MOU: ఎడెక్స్‌తో ఒప్పందం చారిత్రాత్మకం.. ప్రపంచంతో మనం పోటీ పడుతున్నాం..: సీఎం జగన్
YS Jagan in Puthalapattu: రూ.2.70 లక్షల కోట్ల డీబీటీ ఎవరెవరికి ఎంత అందించామంటే.. పూతలపట్టులో సీఎం జగన్
