CM Review on Health Dept: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకమైనదని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టనే కాదు, వైద్య ఆరోగ్య శాఖ ప్రతిష్టను కూడా పెంచుతుంన్నారు. రోగులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందాలని స్పష్టం చేశారు. రోగులకు ఇస్తున్న సదుపాయాలు మెరుగ్గా ఉండాలన్నారు. ప్రతి కలెక్టర్‌కూ దీనిపై ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని, కలెక్టర్‌కు మరిన్ని నిధులు మంజూరు చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. (CM Review on Health Dept)
మూడు అంశాలు గుర్తుపెట్టుకోండి
– ఒకవైపు హెల్త్ క్యాంపులను నిర్వహించడమే కాదు, చికిత్స అవసరమని గుర్తించిన వారి ఆరోగ్యం బాగు అయ్యేంత వరకు చేయిపట్టుకుని నడిపించాలి. చేయూతను అందించడంలో ఇది మొదటిది.
– ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పాత పేషెంట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పాత పేషెంట్ల విషయంలో చేయిపట్టుకుని నడిపించాలి.
– చికిత్స అనంతరం వీరు వాడాల్సిన మందుల విషయంలో అవి ఖరీదైనా సరే వారికి అందించాల్సిన బాధ్యత ఉంది, ఇది రెండో అంశం.
– క్రమం తప్పకుండా వారికి చెకప్‌లు చేసే బాధ్యత తీసుకోవాలి. ఆరోగ్య శ్రీలో కవర్ కాకుండా గతంలో చికిత్సలు చేయించుకున్న పాత రోగుల విషయంలో కూడా వారికి చేయూతను అందించడం అన్నది మూడో బాధ్యత.
– వీరి బాధ్యతను కూడా తీసుకునేలా ఎస్‌ఓపీని రూపొందించండి.
సమీక్ష తప్పనిసరి
– ఆరోగ్య పరంగా, చికిత్సల పరంగా, చెకప్‌ల పరంగా, మందులపరంగా ఎవరికి ఏ అవసరాలు ఉన్నా వారికి అవి తీర్చే దిశగా ఈ చేయూత ఉండాలి.
– ప్రతి సచివాలయం వారీగా ఇలా ఎవరెవరు ఉన్నారనేది వివరాలు తీసుకోండి.
– దీనికి అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే సమకూరుస్తుంది.
– విలేజ్‌క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లతో దీన్ని అనుసంధానం చేయాలి.
– క్రమం తప్పకుండా హెల్త్‌క్యాంపులను నిర్వహించాలి.
– ప్రతీ నెలకు మండలంలో నాలుగు సచివాలయాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలి.
– రోగుల సంతృప్తి, క్యాంపుల్లో సదుపాయాలు, రోగులకు చేయూత నందించడం, ఆరోగ్య సురక్ష కార్యక్రమంమీద అవగాహన, విస్తృత ప్రచారం ఈ 4 అంశాలమీద తప్పనిసరిగా సమీక్ష చేసుకోవాలి.
– ఆరోగ్య సురక్ష మీద ప్రతి వారం క్రమం తప్పకుండా నా దగ్గర సమీక్షలు చేయాలి.
ఆరోగ్యశ్రీ వినియోగంపై అవగాహన
– ఆరోగ్యశ్రీని ఎలా వినియోగించుకోవాలని తెలియని వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదు.
– ఆరోగ్యశ్రీ చికిత్సల కోసం వెళ్లే రోగులకు ప్రయాణ ఛార్జీలు కూడా ఇవ్వాలి.
– ప్రతి ఒక్కరి ఫోన్‌లో కూడా ఆరోగ్య శ్రీ యాప్‌ని డౌన్లోడ్ చేయాలి.
– దీని వల్ల పర్యవేక్షణ మరింత సులభతరం అవుతుంది.
– క్యాంపులకు స్పెషలిస్టులను పంపే విషయంలో మరింత శ్రద్ధ వహించాలి.
– ఎక్కడా తొందరపాటు లేకుండా రోగులకు మంచి సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి.
– క్యాంపులకు తప్పనిసరిగా నలుగురు వైద్యులు వెళ్లాలి, అందులో ఇద్దరు స్పెషలిస్టులు ఉండేలా చూడాలి.
– దీనికి తగినట్టుగా స్పెషలిస్టులను అందుబాటులో ఉంచేలా చూసుకోవాలి.
– పరీక్షలు చేసేటప్పుడు మరింత నిర్ధారణ కోసం అదనపు పరీక్షలు కూడా చేసి, సరైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలి.
రక్తహీనతపై ప్రత్యేక దృష్టి
– రక్తహీనత ఉన్న వారిని గుర్తించి పౌష్టికాహారాన్ని అక్కడే అందించేలా ఎస్‌ఓపీ రూపొందించాలి.
– దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలోనూ మార్పులు రావాలి.
– నిపుణులైన వైద్యులు శిబిరాలకు వస్తున్నప్పుడు అక్కడే వీరికి సర్టిఫికెట్లు జారీ చేయాలి.
– తిరుపతి తరహాలోనే చిన్నపిల్లలకోసం అత్యాధునిక ఆస్పత్రిని విజయవాడ–గుంటూరు, విశాఖపట్నంలలో ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలి.
– ప్రకాశం జిల్లాలో కూడా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.
లక్ష్యంలోగా పూర్తి
ఆస్పత్రుల్లో నాడు–నేడు, కొత్త మెడికల్‌కాలేజీల నిర్మాణ ప్రగతిపై కూడా సీఎం జగన్ సమీక్షించారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణ పనుల్లో పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. అర్బన్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణ పనులను కూడా నిర్దేశించుకున్న లక్ష్యంలోగా పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.
Read Also : CM Jagan at Kakinada: బాబు పేరు చెబితే స్కాములు.. జగన్ పేరు చెబితే స్కీములు గుర్తుకొస్తాయి: సీఎం జగన్