Memantha Siddham: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మూడు వారాలుగా జనం మధ్యే ఉన్నారు. ఉగాది, రంజాన్, గుడ్ ఫ్రైడే లాంటి పండుగలు కూడా జనం మధ్యనే ఉంటూ సీఎం జగన్ కుటుంబం జరుపుకొంది.
21 రోజులుగా కుటుంబానికి దూరంగా, ప్రజలకు దగ్గరగా సీఎం జగన్ ఉన్నారు. రోడ్ షో, ముఖాముఖి, బహిరంగ సభలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఎర్రటి ఎండను లెక్కచేయక ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు. ప్రజల మధ్యలో బాధితులను చూసి బస్సు దిగి మరీ భరోసా ఇస్తున్నారు. యాత్ర దారిలో ప్రజలతో పలకరింపులు, పరామర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
24 గంటల్లో ప్రతి నిమిషం పక్కా షెడ్యూల్ ప్రకారమే యాత్ర జరుగుతోంది. రోజుకు నాలుగైదు గంటలు మాత్రమే సీఎం జగన్ నిద్రపోతున్నట్లు తెలుస్తోంది. ఉదయం 4 గంటల నుంచే రోజువారీ షెడ్యూల్ మొదలవుతోంది. వేకుమనే సీఎం జగన్ యోగాసనాలు, ధ్యానం చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఒక్కోసారి అల్పాహారానికంటే ముందే నేతలతో మీటింగ్స్ నిర్వహిస్తూ జగన్ బిజీగా గడుపుతున్నారు. క్యాంప్ లోనే చేరికలు, ఎన్నికల పై వ్యూహా ప్రతివ్యూహాలు రచిస్తున్నారు.
మరోవైపు క్యాంప్ కు వచ్చే బాధితులకు భరోసా కల్పిస్తున్నారు సీఎం జగన్. కనీస సౌకర్యాలతోనే బస్సుయాత్ర కొనసాగడం చెప్పుకోదగ్గ విషయం. సాధారణ వ్యక్తిలా జనం మధ్య సీఎం జగన్ ఉంటున్నారు. దీంతో సెక్యూరిటీ వాళ్లకు పెద్ద ఇబ్బందిగా మారుతోంది. విజయవాడ నగరంలో జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పటి నుంచి సెక్యూరిటీ సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉంటున్నారు.
బస్సుయాత్రలో ప్రజల కష్టాలను సీఎం జగన్ తెలుసుకుంటున్నారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, ఇతర వ్యవస్థల ద్వారా ఇంటికే పెన్షన్, రేషన్, పౌర సేవలు అందిస్తున్నప్పటికీ ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే వారిని ఆదుకునేందుకు జగన్ ప్రజలతో మమేకమవుతున్నారు. రైతులు, కార్మికులు, మహిళలు, యువతతో జగన్ ముఖాముఖి నిర్వహిస్తున్నారు. యాత్ర ఫీడ్ బ్యాక్ తో మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే, కడపులోని బిడ్డ నుంచి వృద్ధుల వరకు పథకాలు అందిస్తున్న సీఎం జగన్ వీటిని కొనసాగిస్తూనే మరిన్ని కొత్త పథకాలకు పథక రచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
21వ రోజు షెడ్యూల్
సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా 21వ రోజు నేడు ఉదయం 9 గంటలకు ఎండాడ MVV సిటీ రాత్రి బస నుంచి బయలుదేరనున్నారు. మధురవాడ, మీదుగా ఆనందపురం చేరుకుని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తగరపువలస మీదుగా జొన్నాడ సెంటర్ చేరుకుంటారు. జొన్నాడ దాటిన తర్వాత భోజన విరామం తీసుకుంటారు. బొద్దవలస మీదుగా సాయంత్రం 3:30 గంటలకు చెల్లూరు వద్ద బహిరంగ సభలో పాల్గొని కేడర్, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలస రాత్రి బస శిబిరానికి చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి: Memantha Siddham: మేమంతా సిద్ధం.. జనంలోకి జననేత.. ఇవాళ్టి షెడ్యూల్ ఇదీ
YS Jagan vs All: పిక్చర్ క్లియర్.. ఒక్క జగన్ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్..!
Attack on YS Jagan: సీఎం జగన్‌పై దాడి కేసు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
