Process Foods: గజిబిజి జీవన శైలి కారణంగా చాలా మంది నేటి కాలంలో బయట ఫుడ్ తింటుంటారు. ఆహారపదార్థాలను ఎక్కువసేపు ప్రాసెస్ చేస్తే హృద్రోగాలు, క్యాన్సర్, మధుమేహం, అకాల మరణం సహా ఆరోగ్యంపై 32 రకాల హానికారక ప్రభావాలు చూపుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
తాజా అధ్యయనం ప్రకారం దాదాపు కోటి మందిపై నిర్వహించిన 45 మెటా అనాలిసిస్ రివ్యూ అనంతరం ఈ వివరాలను అధ్యయనం తెలిపింది. రెడీ టూ ఈట్, ఇన్‌స్టంట్ ఫుడ్స్ వంటి అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకుంటే తీవ్ర అనారోగ్యాల బారినపడే అవకాశం ఉందని ఈ అధ్యయనం పేర్కొంది.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఆరోగ్యానికి హాని కలిగించే పదార్ధాలు చాలా ఉంటాయని జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆప్ పబ్లిక్ హెల్త్, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, సోర్బనే యూనివర్సిటీ ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలోని డీకిన్ యూనివర్సిటీ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన పరిశోధకులు స్పష్టం చేశారు.
అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే హృద్రోగాలు, మానసిక సమస్యలతో పాటు అకాల మరణం ముప్పు వాటిల్లుతుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ప్యాకేజ్డ్ బేక్డ్ ఫుడ్స్, స్నాక్స్, ఫిజ్జీ డ్రింక్స్, తీపితో కూడిన సిరిల్స్, రెడీ టు ఈట్ మీల్స్ వంటి అధిక ప్రాసెస్ చేసిన ఆహారాల్లో అధిక షుగర్, కొవ్వు, సాల్ట్ ఉండటంతో పాటు విటమిన్స్, ఫైబర్ స్వల్పంగానే ఉంటుంది.
అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు తీసుకోవడం వల్ల ఊబకాయం ముప్పు 55 శాతం పెరిగే ప్రమాదం ఉంఉందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి తలెత్తే అవకాశం 41 శాతం, మధుమేహం వచ్చే ముప్పు 40 శాతం, కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం 20 శాతం అధికంగా ఉంటుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
ఇవీ చదవండి: Eye health: కంటి ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..
Kakara Kaya: చేదైన ఆహారం.. పోషక గుణాల్లో తియ్యదనం.. కాకర కాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవీ..
Cluster Beans: గోరుచిక్కుడుతో అద్భుత ప్రయోజనాలు.. కండరాల ఎదుగుదలకు చక్కటి ఆహారం
