CM Jagan Ramzan wishes: రంజాన్ పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ తెలిపారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు (ఈద్ ముబారక్) తెలిపారు.
దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, సాటి మానవులకు సేవ, వంటి సత్కార్యాల ద్వారా అల్లాహ్ స్మరణలో తరించే ఈ రంజాన్, రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు కలిగించాలని ముఖ్యమంత్రి తన శుభాకాంక్షల సందేశంలో ఆకాంక్షించారు.
మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ.. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని, అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
ఇవీ చదవండి: YS Jagan with Pensioners: చంద్రబాబు 40 ఏళ్ల అనుభవంలో ఏనాడైనా ఇంటికే పెన్షన్ ఇచ్చాడా?: సీఎం జగన్ సూటి ప్రశ్న
YS Jagan Ugadi wishes: తెలుగు వారికి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
Ambati Rambabu: జగన్ దెబ్బకు తట్టుకునే శక్తి టీడీపీకి లేదు: మంత్రి అంబటి రాంబాబు
