Summer: వేసవి అప్పుడే దడపుట్టిస్తోంది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వచ్చే నెలలో ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో భాగమే తెలుగు రాష్ట్రాల్లో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల వాతావరణం నేపథ్యంలో వచ్చే నెలలోనే ఏకంగా 50 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మార్చి నెల ప్రారంభంలోనే ఉదయం 10 గంటల తర్వాత నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా మొదలైంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందోనన్న ఆందోళన అందరిలో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ పైనే నమోదవుతోంది. ఈ నెలాఖరుకు ఈ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదయ్యే ప్రమాదం ఉంది.
ఈసారి గతేడాది కంటే ఎండలు మండి పోతాయని, రోళ్లు పగిలే ఎండలు నమోదు అవుతాయని భారత వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతారని అధికారులు తెలిపారు. అందుకు గల కారణాలను కూడా చెబుతున్నారు.
ఎల్‌నినో పరిస్థితులు ఈ సీజన్ లోను కొనసాగుతాయని, ఈ పరిస్థితుల కారణంగా భారతదేశంలో వేసవి ప్రారంభంలోనే ఎండ తాకిడి ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ ఒక అంచనాకు వచ్చింది. ఈ క్రమంలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే రోజులే ఎక్కువగా ఉంటాయని పేర్కొంంది.
మార్చి, మే నెల మధ్యలో భారతదేశంలో అత్యధిక గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర కర్ణాటక, ఈశాన్య భారతంతో కూడిన ప్రాంతాలలో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక ఇదే సమయంలో దేశంలో ఏప్రిల్ నెలలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేస్తోంది.
ఇవీ చదవండి: Hot weather care: ఎండ వేడిమికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
Hot weather: తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు
Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగ.. గరిష్ఠ ఉష్ణోగ్రతలతో ఉక్కపోత
