HomeLife StyleObesity in Kids: చిన్నారుల్లో పెరిగిపోతున్న ఊబకాయం.. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మందికి..!

Obesity in Kids: చిన్నారుల్లో పెరిగిపోతున్న ఊబకాయం.. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మందికి..!

Obesity in Kids: ఊబకాయం సమస్య ఈ మధ్య కాలంలో పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఊబకాయం బారిన పడుతున్నారు. ఆధునిక జీవన శైలి, మారిన ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన సమస్యలు వెరసి.. ఊబకాయానికి దారి తీస్తోందని నిపుణులు చెబుతున్నారు.

చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతూ.. ఇతర జబ్బులకూ దారితీసి ప్రాణాంతకంగా మారుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు, పెద్దలు, కౌమారదశలో ఉన్నవారు ఇలా మొత్తం 100 కోట్ల మందికి పైగా ఊబకాయం వచ్చి చేరిందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

1990 నుంచి తక్కువ బరువు ఉన్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీని ఫలితంగా చాలా దేశాల్లో స్థూలకాయం అత్యంత సాధారణంగా మారిపోయిందని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేస్తోంది. భారత్‌లో 1990తో పోల్చితే ప్రస్తుతం పిల్లలు, యుక్త వయసు వారిలో ఊబకాయం నాలుగు రెట్లు అధికంగా పెరిగిపోయిందని అధ్యయనం స్పష్టం చేసింది.

5 సంవత్సరాల నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న 12.5 మిలియన్ల మంది పిల్లల్లో ఊబకాయం ఎక్కువగా పెరిగిపోయిందని తాజా అధ్యయనం పేర్కొంది. అధికంగా అబ్బాయిలే ఊబకాయంతో బాధపడుతున్నట్లు బహిర్గతమైంది. 7.3 మిలియన్ల మంది బాలురు ఊబకాయ సమస్యతో సతమతం అవుతున్నారు. మరోవైపు 5.2 మిలియన్ల మంది బాలికలు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అధ్యయనంలో తేలింది.

ఎన్‌సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థల వద్ద అందుబాటులో ఉన్న గ్లోబల్ డేటా ఆధారంగా ఈ అంశాలపై పరిశీలన జరిపినట్లు అధ్యయనం చేసిన వ్యక్తులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా వయసు పైబడిన మహిళల్లో ఊబకాయం రెండింతలు, పురుషుల్లో దాదాపు 3 రెట్లు పెరిగిందని అధ్యయనంలో తేలింది. 2022లో మొత్తం 159 మిలియన్ల మంది పిల్లలు, యుక్త వయసులో ఉన్న వారు, 879 మిలియన్ల మంది పెద్ద వాళ్లు ఊబకాయం బారిన పడిన వారిలో ఉన్నారని అధ్యయనం తెలిపింది.

ఇవీ చదవండి: Walking: ఏ వయసు వారు రోజూ ఎంత దూరం నడవాలి? ఎన్ని అడుగులు వేయాలి?
Onion: ఉల్లిపాయ తొక్కతో ఊహించని ప్రయోజనాలు..!
Type 2 Diabetes: టైప్-2 డయాబెటిస్ లక్షణాలు.. ఎలా కంట్రోల్‌ చేయాలంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు