HomeAndhra PradeshSajjala Ramakrishna Reddy: కూటమిలో జనసేన, బీజేపీ ఉనికే లేకుండా చేస్తున్న చంద్రబాబు

Sajjala Ramakrishna Reddy: కూటమిలో జనసేన, బీజేపీ ఉనికే లేకుండా చేస్తున్న చంద్రబాబు

Sajjala Ramakrishna Reddy: ప్రతిపక్ష కూటమిలో బీజేపీ, జనసేన పార్టీల ఊసే లేకుండా మొత్తం చంద్రబాబు తన మనుషులతో నింపేస్తున్నారని వైయస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైయస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నిరాశా నిస్పృహలతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే..

“కూటమిలో జనసేన, బీజేపీకి అసలు ఉనికే లేకుండా చేస్తున్నారు. జనసేన,బిజేపీ అభ్యర్ధులను చంద్రబాబే నిర్ణయిస్తున్నారు. చంద్రబాబు అనుకున్నవాళ్లకే టికెట్లు ఇచ్చుకున్నారు. చంద్రబాబు ఏది చెబితే అదే జరగాలని కోరుకుంటున్నారు. ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచన లేకుండా బాబు ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు పిల్లచేష్టలు చేస్తున్నారు, సీఎంను నోటికొచ్చినట్టు తిడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు.

ఇప్పుడు కూడా అధికారులను కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అధికారులపై చంద్రబాబు అండ్ కో తప్పుడు ఫిర్యాదులు చేస్తోంది. బాబు ఎన్నికుట్రలు చేసినా 93 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తిచేశాం. పెన్షన్లు ఇవ్వడానికి డబ్బు లేదని తప్పుడు ప్రచారం చేశారు. చంద్రబాబుది రాక్షస మనస్తత్వం. వ్యవస్ధలపై చంద్రబాబుకు గౌరవమే లేదు. వృద్దులకు టైమ్ కి పెన్షన్లు అందకుండా చంద్రబాబు పాపానికి పాల్పడ్డారు.

వాలంటీర్లపై కక్షతోనే చంద్రబాబు. వ్యవస్ధలపై దాడి చేయడమే చంద్రబాబు విధానం. వైయస్సార్‌సీపీ హయాంలో ప్రతి వ్యవస్ధ కూడా స్వతంత్రంగా పనిచేస్తున్నాయి. సచివాలయ ఉద్యోగులు లక్షా 25 వేల మంది ఉన్నారని బాబే ఒప్పుకున్నారు. చంద్రబాబును వృద్దులు బండ బూతులు తిడుతున్నారు.

పెన్షన్ల కోసం పచ్చి వృద్దులు మరణించడానికి బాబు కారణం కాదా? చంద్రబాబు కోసమే పురంధేశ్వరి పనిచేస్తున్నారు. బాబు ఏజెంట్ గానే అధికారులపై ఈసీకి పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు. ఈసీ తాము చెప్పినట్టు వింటుందని పురంధేశ్వరి భావిస్తున్నారా? చంద్రబాబు.. మాయల ఫకీరులాగా హామీలు ఇస్తున్నారు.” అని సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్‌ చేశారు.

ఇవీ చదవండి: Sajjala on CBN: వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కుట్రపూరితంగా మాట్లాడుతున్నారు : సజ్జల రామకృష్ణారెడ్డి
Perni Nani: చంద్రబాబు ఏనాడూ సచివాలయం గుమ్మం తొక్కలేదు: పేర్ని నాని
Vasireddy Padma: వైయస్ కుటుంబంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు: వాసిరెడ్డి పద్మ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు