CEC: ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనలు జారీ చేయొద్దని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు చేసింది. స్టార్ క్యాంపెయినర్లు బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అవాస్తవమైన, ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయొద్దని తెలిపింది.
సామాజిక వర్గం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అడగ కూడదని వెల్లడించింది. వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించరాదని హితవు పలకింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. ముఖ్యంగా గతంలో నోటీసులు అందుకున్న స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు మరింత బాధ్యతగా, జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది.
ఈసీ సూచించినవి ఇవీ..
* ప్రార్థనా మందిరాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారానికి వాడుకోవద్దు.
* ప్రచారంలో మర్యాదపూర్వకంగా, నైతిక బాధ్యతతో వ్యవహరించాలి.
* సమస్యలే ప్రధానాంశాలుగా ఎన్నికల్లో ముందుకెళ్లాలి.
* సామాజిక మాధ్యమాల్లోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి.
* ప్రత్యర్థులను దూషించే లేదా కించపరిచే పోస్టులు పెట్టరాదు.
* విభజనవాదం, వ్యక్తిగత దాడులను ప్రేరేపించేలా వ్యవహరించరాదు.
* నైతిక, గౌరవప్రద రాజకీయ చర్చలను ప్రోత్సహించాలి.
* ప్రచార కార్యక్రమాల్లో చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ భాగం చేయకూడదు.
* బాల కార్మిక చట్టాలు, నిబంధనలు సరిగ్గా అమలయ్యేలా చూసుకునే బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులదే.
* ఎన్నికల సందర్భంగా నేతలు ఇచ్చే హామీల అమలు సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంటుంది.
* మేనిఫెస్టోలో హామీలు ఇచ్చే హక్కు పార్టీలకు ఉంటుంది.
* ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఇటీవల పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చదవండి: Vote: ఓటు వేసేందుకు ఆధార్ తప్పనిసరి కాదు.. కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత
AP DCS Exam: ఏపీలో డీఎస్సీ పరీక్ష వాయిదా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏమన్నారంటే..
Lok sabha elections: లోక్ సభ ఎన్నికలకు నగారా.. తొలి దశ నోటిఫికేషన్ జారీ
