HomeNationalCongress Manifesto: కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్.. హైలైట్స్ ఇవీ..

Congress Manifesto: కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్.. హైలైట్స్ ఇవీ..

Congress Manifesto: కాంగ్రెస్ పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ పాల్గొన్నారు. న్యాయ్ పత్ర పేరుతో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు.

మేనిఫెస్టోలో హైలైట్స్ ఇవీ..
ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమం సూత్రాలపై కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. సామాజిక న్యాయం కింద పింఛన్ రూ.1000కి పెంపు హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్ పెంపునకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వ్ చేసిన పోస్టులను ఏడాదిలో భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల స్కాలర్ షిప్ రెట్టింపు
* పేద మహిళలకు ఏడాదికి రూ.1లక్ష
* కనీస మద్దతు ధర చట్టం తీసుకొస్తామని హామీ
* విద్యార్థులకు రూ.1లక్ష ఆర్థికసాయం
* రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ
* ప్రతి జిల్లాలో లైబ్రరీలతో కూడిన అంబేడ్కర్ భవనాలు
* వైద్యులు, వైద్యసిబ్బందిపై దాడికి పాల్పడితే కఠినచర్యలకు చట్టం
* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్
* ఉపాధి హామీ పథకం కూలీ రోజుకు రూ.400కు పెంపు

న్యాయ్ పత్ర – 2024
* 48 పేజీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన అగ్రనేతలు
* ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమం సూత్రాలపై మేనిఫెస్టో
* 5 న్యాయపథకాలు, 25 హామీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో
* 30 లక్షల ఉద్యోగాల కల్పన
* రూ.5,000 కోట్లతో యువతకు స్టార్టప్ ఫండ్
* విద్యారుణాల వడ్డీ రేటు తగ్గింపు
* అగ్నివీర్ స్కీం రద్దు, ఆర్మీలో మళ్లీ అమల్లోకి పాత రిక్రూట్ మెంట్ స్కీమ్
* గృహలక్ష్మి పథకం ద్వారా మహిళల ఖాతాల్లోకి నగదు జమ
* రూ.450కి వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ
* బస్సు ప్రయాణంలో మహిళలకు రాయితీ
* రైతులకు కనీస మద్దతు ధరపై హామీ. వ్యవసాయ పరికరాల ధరల నుంచి జీఎస్టీ మినహాయింపు
* పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు
* కులగణన ఆధారంగా రిజర్వేషన్ల కల్పన, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపు
* న్యాయ్ యోజన ద్వారా పేద కార్మిక కుటుంబాలకు సంవత్సరానికి రూ.72 వేల ఆదాయం
* వృద్ధులకు టికెట్లలో రాయితీల కల్పన
* రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేత
* చిన్నతరహా పరిశ్రమల రుణాలను కొంతమేరకు మాఫీచేసి తక్కువ వడ్డీకి రుణాల పంపిణీ
* దేశవ్యాప్తంగా 8 కోట్ల కుటుంబాలకు కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పంపిణీ..
ఇవీ కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు..

పదేళ్లుగా న్యాయం జరగలేదు: చిదంబరం
గత పదేళ్లుగా ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. గడిచిన పదేళ్లుగా అన్ని రంగాల్లో విధ్వంసం జరిగిందన్నారు. ధరలు పెరిగాయి.. నిరుద్యోగిత పెరిగిపోయిందన్నారు. ఆశగా ఎదురుచూసిన యువతకు నిరాశే మిగిలిందని కామెంట్స్ చేశారు. గడిచిన ఐదేళ్లలో ప్రజాస్వామ్యం బలహీనపడిందని చెప్పారు. ధనికుల వల్ల, ధనికుల కోసం, ధనికుల చేత అనేలా బీజేపీ పాలన ఉందని వ్యాఖ్యానించారు. దేశంలో ఉన్న ఒక్క శాతం ధనికుల కోసమే బీజేపీ సర్కార్ పాలన సాగిందని ఆరోపించారు. నిరుపేదలను మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 2024లో అధికారంలో రాగానే పేదల జీవితాల్లో వెలుగు తీసుకొస్తామంటూ చిదంబరం పేర్కొన్నారు.

ఇవీ చదవండి: PM Modi at Chilakaluripeta: ప్రధాని మోదీ సుతిమెత్తని విమర్శలు.. ఏపీలో జగన్‌ పార్టీ, కాంగ్రెస్‌ వేర్వేరు కాదని కామెంట్స్‌
Congress Guarantees: మహిళా న్యాయ గ్యారంటీ కింద కాంగ్రెస్‌ 5 హామీలు
YS Jagan vs All: పిక్చర్‌ క్లియర్‌.. ఒక్క జగన్‌ వర్సెస్‌ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు