Vasireddy Padma: వైయస్ కుటుంబంలో చిచ్చు పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని వైయస్సార్ సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. వైయస్ షర్మిల ప్రవర్తిస్తున్న తీరుపై ఆమె ఇవాళ తాడేపల్లిలోని వైయస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే..
’’జరుగుతున్న రాజకీయాలను కడప ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు ఉచ్చులో షర్మిల చిక్కుకున్నారు. హంతకుడు అంటూ అవినాష్ పై నింద వేస్తున్నారు. మీకు కోర్టుల మీద, వ్యవస్థల మీద నమ్మకం లేదా? మీ బుర్రలో ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు. షర్మిలను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదాను కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదు?
షర్మిల ఎన్ని విషయాల్లో యూటర్న్ తీసుకున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు షర్మిల సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎదురుదాడి చేయడం కాదు… ప్రజలకు సంజాయిషీ చెప్పాలి. షర్మిల తీరు చూస్తుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. జగన్ ను ఓడించాలని కుట్రలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ దోషి. ఏపీ ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలి. వ్యక్తిగత ఎజెండాతో జగన్ పై నిందలు వేస్తున్నారు. జగన్ ను కాపాడుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: Vasireddy Padma on Pawan: మహిళలను గౌరవించే చరిత్ర బాబు, పవన్‌కు లేదు : వాసిరెడ్డి పద్మ ఫైర్
Perni Nani: చంద్రబాబు ఏనాడూ సచివాలయం గుమ్మం తొక్కలేదు: పేర్ని నాని
Junior NTR Flex: జూనియర్‌ను డైరెక్ట్‌గానే టార్గెట్ చేసిన చంద్రబాబు? బాలయ్య చేష్టలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే..
