HomeNationalCongress Guarantees: మహిళా న్యాయ గ్యారంటీ కింద కాంగ్రెస్‌ 5 హామీలు

Congress Guarantees: మహిళా న్యాయ గ్యారంటీ కింద కాంగ్రెస్‌ 5 హామీలు

Congress Guarantees: దేశ వ్యాప్తంగా మోదీ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఇంకా యుద్ధం మొదలుపెట్టనట్టు కనిపిస్తోంది. అయితే, తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే యాక్టివ్‌ అయ్యారు. మోదీని ఢీకొట్టేలా హామీలు గుప్పిస్తున్నారు. మహిళా న్యాయ గ్యారంటీ కింద కాంగ్రెస్‌ తరఫున ఐదు హామీలు ఇస్తున్నట్లు ఖర్గే వెల్లడించారు.

ఇప్పటికే మహిళల కోసం నారి న్యాయ్ హామీ ప్రకటించిన కాంగ్రెస్.. మహాలక్ష్మి హామీ కింద నిరుపేద మహిళలకు ఏటా రూ.లక్ష సాయం అందిస్తామని తెలిపింది. సగం జనాభా – పూర్తి హక్కుల పథకం కింద కేంద్ర ప్రభుత్వం కొత్త నియామకాల్లో మహిళలకు సగం హక్కులు వర్తించేలా చేస్తామని ఖర్గే తెలిపారు. అధికారం పట్ల గౌరవం పథకం కింద అంగన్వాడీ, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికుల నెలసరి వేతనానికి కేంద్ర సహకారం రెట్టింపు చేస్తామని కాంగ్రెస్‌ తెలిపింది.

సరైన స్నేహం కింద మహిళలకు వారి హక్కులపై అవగాహన కల్పించేందుకు అవసరమైన సహాయం కోసం ప్రతి పంచాయతీలో లీగల్ అసిస్టెంట్ నియామకం చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. సావిత్రిబాయి ఫూలే హాస్టల్ పథకం కింద దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రధాన కార్యాలయాల్లో కనీసం ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉండేలా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఈ హాస్టళ్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని ఖర్గే పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడే తమ పోరాటంలో కాంగ్రెస్ కు అన్ని వర్గాలు, పక్షాలు మద్దతుగా నిలవాలని ఖర్గే పిలుపునిచ్చారు.

‘కిసాన్ న్యాయ్’ పేరిట రైతులకు 5 గ్యారంటీలు

కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్‌ తెలిపింది. వ్యవసాయ పరికరాల పై జీఎస్టీ ఎత్తివేస్తామని తెలిపింది. రైతుల రుణమాఫీ కోసం శాశ్వత రుణమాఫీ కమిషన్ ఏర్పాటు చేస్తామంటూ కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. పంట బీమా సొమ్ము 30 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. రైతులకు న్యాయం జరిగేలా కొత్త ఎగుమతి, దిగుమతి విధానం ప్రవేశపెడతామని కాంగ్రెస్‌ తెలిపింది.

అధికారంలోకి వస్తే రైతులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. ‘‘కిసాన్ న్యాయ్’’ ద్వారా ప్రతి రైతు జీవితంలో సంతోషాన్ని నింపుతామంది. 62 కోట్ల మంది రైతులకు బీజేపీ దురాగతాల నుంచి విముక్తి చేస్తామంటూ పిలుపునిచ్చింది. స్వామినాథన్ కమిషన్ ఫార్ములా ప్రకారం MSPకి చట్టబద్ధత కల్పిస్తామంది. బీమా ప్లాన్ ను మార్చడం ద్వారా పంట నష్టం జరిగితే 30 రోజులలోపు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో చెల్లింపులు జరిగేలా చూస్తామంది.

ఇవీ చదవండి: Modi Youtube Channel: 2 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు.. దూసుకెళ్తున్న ప్రధాని మోదీ యూట్యూబ్‌ చానల్‌
CM Jagan with Modi: ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. ప్రత్యేక హోదా, రాష్ట్రానికి నిధులపై చర్చ
YS Jagan vs All: పిక్చర్‌ క్లియర్‌.. ఒక్క జగన్‌ వర్సెస్‌ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు