Shanti Swaroop: తొలి తెలుగు న్యూస్ రీడర్‌గా పేరు గాంచిన శాంతి స్వరూప్ (Shanti Swaroop) ఇక లేరు. రెండు రోజుల కిందట గుండెపోటుతో హైదరాబాద్ నగరంలోని యశోద ఆస్పత్రిలో ఆయనను కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ శుక్రవారం ఆయన కన్ను మూశారు. తెలుగులో తొలిసారి వార్తలు దూరదర్శన్‌లో చదివి ఆయన తెలుగు వారికి పరిచయం అయ్యారు. తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నారు.
సుమారు దశాబ్ద కాలం పాటు టెలీప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి వార్తలు చెబుతూ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 1983 నవంబర్ 14 నుంచి దూరదర్శన్‌లో వార్తలు చదవడం ఆయన మొదలు పెట్టారు. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు శాంతిస్వరూప్ అనేలా ముద్ర వేసుకున్నారు. 2011లో పదవీ విరమణ చేసేవరకు కూడా ఆయన దూరదర్శన్‌లోనే వర్క్ చేశారు. లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు సైతం శాంతి స్వరూప్ అందుకున్నారు. శాంతిస్వరూప్‌కు భార్య, ఇద్దరు కుమారులు సంతానం.
ఇవీ చదవండి: Wax gourd: బూడిద గుమ్మడికాయతో మీ ఆరోగ్యం పదిలం.. ప్రయోజనాలు ఇవీ..!
Sitting on Chair: రోజూ ఎక్కువ సమయం కుర్చీలోనే కూర్చుంటున్నారా? శారీరక ఆరోగ్య ప్రమాదాలు!
Peas: వేయించిన శనగలు.. మితంగా తీసుకుంటే రుచి, ఆరోగ్యం.. ప్రోటీన్స్ సమ్మిళితం
