Walking: గజిబిజి జీవనశైలి కారణంగా ఈ కాలంలో వ్యాయామం చేసే వారి సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది. ఫలితంగా ఊబకాయం, డయాబెటిస్ లాంటి రోగాల బారిన పడుతున్నారు. మంచి ఆరోగ్యానికి నడక ఎంతో మేలు చేస్తుందన్నది అందరికీ తెలిసిందే. ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ప్రతీ రోజూ ఎంతో కొంత దూరం నడవాలని వైద్యులు కూడా చెబుతుంటారు. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో నడక కీలక భూమిక పోషిస్తుంది. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి దోహదపడుతుంది.
నడక మంచిదని అందరికీ తెలిసిందే. కానీ ఏ వయసు వారు ఎంత సేపు నడవాలన్న విషయం పలువురికి తెలియదు. ఏ వయసు వారు, ఎంత దూరం వాకింగ్ చేయాలో, నిపుణులు ఏమంటున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.
మన శరీరం ఫిట్‌గా ఉండటానికి జిమ్‌కి వెళ్లడం లేదా యోగా చేయడం లాంటివి చాలా మంది చేస్తుంటాం. కానీ అంతకంటే నడకను ఇష్టపడే వారు చాలా మందే ఉంటారు. ఆరోగ్యకరమైన శరీరం కోసం ప్రతిరోజూ కచ్చితంగా కొంత దూరమైన నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. నడక బెస్ట్ ఎక్సర్‌సైజ్‌గా స్పష్టం చేస్తున్నారు. నడక మొత్తం శరీరానికి వ్యాయామాన్ని అందిస్తుంది. ఒక రోజులో ఎంతసేపు నడవాలనే సందేహం చాలా మందికి కలుగుతుంది.
స్వీడన్‌లోని కోల్‌మార్ యూనివర్సిటీలో పబ్లిష్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. ఒక వ్యక్తి తన వయస్సును బట్టి నడవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది బరువును అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో, జీవనశైలి సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయని ఆ అధ్యయనంలో తేలింది. 6 నుంచి 17 ఏళ్ల వయసులో ఉన్న వారు రోజుకు కనీసం 15 వేల అడుగులు వేయాలట. కానీ అమ్మాయిలు 12 వేల అడుగులు నడిస్తే సరిపోతుందని అధ్యయనంలో వెల్లడించారు.
స్త్రీ, పురుషులు ఎంత దూరం నడవాలి?
18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసులో ఉన్న స్త్రీ, పురుషులు రోజుకు కనీసం 12 వేల అడుగులు నడవాలని నిపుణులు పేర్కొంటున్నారు. 40 ఏళ్లు పైబడిన వారిలో సహజంగానే ఆరోగ్య సంబధిత సమస్యలు మొదలవుతాయి. ఈ వయసులో వారు రోజుకు 11 వేల అడుగులు నడవాలని చెబుతున్నారు. 50 ఏళ్లు పైబడిన వారు రోజుకు 10 వేల అడుగులు నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు 60 ఏళ్లు పైబడిన వాళ్లు రోజుకు 8 వేల అడుగులు నడిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: Sugar patients: చక్కెర వ్యాధిగ్రస్తులు ఎలాంటి వ్యాయామాలు చేయాలి?
Type 2 diabetes: టైప్-2 డయాబెటిస్‌ను ముందే గుర్తించగలమా? నిర్ధారణ అయితే ఏం చేయాలి?
Stress: ఒత్తిడిని జయించడానికి కొత్త మార్గాలు.. వ్యాయామం, యోగాతో పాటు ఇవీ కూడా..!
Exercise: వ్యాయామం చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు చూడొచ్చు? ఏరోబిక్‌తో హెల్తీ లైఫ్
