Ginger Garlic Paste: ప్రస్తుత గజిబిజి జీవన శైలిలో భాగంగా ఎక్కువ మంది బయటి ఫుడ్ తినడానికి ప్రిఫర్ చేస్తున్నారు. బయట ఆహారం కల్తీ జరుగుతుందని తెలిసినప్పటికీ తినే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. అయితే, ఇంట్లో వంట చేసుకునే వారు కూరగాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి, ఆయిల్, ఇతర ఇంగ్రిడియంట్స్ అన్ని బయటనే కొంటున్నారు. ఇంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి తయారు చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ లో దొరుకుతుంది కదా అని రెడిమేడ్ తీసుకుని రావడం వల్ల ఆరోగ్యం మనమే ఇబ్బందులపాలు చేసుకున్నట్లవుతుంది.
ఇటీవల హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ దారుల గుట్టు రట్టయ్యింది. కల్తీ అల్లం వెల్లుల్లి మిశ్రమం తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 7 క్వింటాళ్ల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. ఉప్పర్ పల్లిలో డక్కన్ ట్రేడర్స్ పేరుతో అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీగా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వీటిని షాపుల్లో అమ్మిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
అంతా నాసిరకమే
నిందితుల నుంచి 625 కేజీల నాసిరకం వెల్లుల్లి, 100 కిలోల నాసిరకం అల్లం, కెమికల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీ జింజర్ పేస్ట్ విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందట. బేగంబజారులోని రెండు దుకాణాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. పెద్ద మొత్తంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుబడటంతో అవి ఎక్కడి నుంచి తెచ్చారో అని వాకబు చేశారు. నిందితులు పాటిగడ్డకు చెందిన పాండు రంగారావు, డెక్కన్ ట్రేడర్స్ యజమాని రహీం, అజయ్ కుమార్, అహీర్, తెలంగాణ ఏజెన్సీ యాజమాన్యం ప్రదీప్ సంక్లా తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదే కేసులో ప్రధాన నిందితుడు గుజరాత్ కు చెందిన రహీం చరణీయ అని గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు నిర్ధరించారు. కల్తీ అల్లం, వెల్లుల్లి మిశ్రమం తిన్నట్లయితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు చూసి అయినా సరే.. అల్లం, వెల్లుల్లిని మనమే కొనుక్కుని మనమే పేస్ట్ తయారు చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: Wax gourd: బూడిద గుమ్మడికాయతో మీ ఆరోగ్యం పదిలం.. ప్రయోజనాలు ఇవీ..!
Sitting on Chair: రోజూ ఎక్కువ సమయం కుర్చీలోనే కూర్చుంటున్నారా? శారీరక ఆరోగ్య ప్రమాదాలు!
Daily Egg: రోజుకో గుడ్డు.. ఆరోగ్యానికి వెరీ గుడ్డు.. ఉడికించిన గుడ్డులో పోషకాలెన్నో తెలుసా?
