Gudivada Amarnath: మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు ఎట్టకేలకు అసెంబ్లీ బరిలో నిలిచే అవకాశాన్ని సీఎం జగన్ కల్పించారు. ఇటీవల ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇందుకు కారణం.. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్న అనకాపల్లి అసెంబ్లీ సీటు మరొకరికి వెళ్లిపోవడమే. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మలసాల భరత్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుడివాడ అమర్‌నాథ్‌కు ఎన్నికల బరిలో నిలిచే అవకాశం లేకుండా పోయిందని అందరూ భావించారు. Gudivada Amarnath
నిన్న విడుదల చేసిన జాబితాలో చిలకలూరిపేట నుంచి కావటి మరోహన్ నాయుడును సమన్వయకర్తగా నియమిస్తున్నట్లు అధికార పార్టీ వైయస్సార్ సీపీ తెలిపింది. అలాగే విశాఖ జిల్లా గాజువాక స్థానం నుంచి మంత్రి గుడివాడ అమర్‌నాథ్ బరిలో నిలుస్తారంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గాజువాక రాజకీయం ఆసక్తికరంగా మారింది.
ఇక్కడ తిప్పల నాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తిప్పల నాగిరెడ్డి వర్గం ఇక్కడ మంత్రి గుడివాడకు సహకరిస్తుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
పలు సర్వేలు, అధ్యయనాలు, పార్టీ అంతర్గత రిపోర్టుల్లో సైతం అనకాపల్లి నుంచి మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు మళ్లీ టికెట్ ఇస్తే ఓటమి గ్యారెంటీ అని తేలిన నేపథ్యంలోనే సీఎం జగన్ ఆయనకు అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం అనకాపల్లి బరిలో వైయస్సార్‌సీపీ తరఫున మలసాల భరత్ పోటీలో ఉండగా, టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ బరిలో నిలిచారు.
మరోవైపు మంత్రి గుడివాడ మాత్రం తనకు టికెట్ రాకపోయినప్పటికీ నిరుత్సాహపడకుండా జగన్ వెన్నంటే ఉంటానని ప్రకటించారు. టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా జగన్‌ను వీడేది లేదని, పార్టీ కోసం కష్టపడతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన నిబద్ధతను గుర్తించిన సీఎం జగన్.. గాజువాక నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. గాజువాక బరిలో నిలుస్తున్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్.. మళ్లీ గెలుస్తారా? గెలిచి మళ్లీ మంత్రి అవుతారా? వేచి చూడాల్సిందే.
ఇదీ చదవండి: AP Industrial growth: ఏపీలో పరిశ్రమలు పారిపోతున్నాయా? ఒక్కసారి ఇటు చూసి నిజాలు తెలుసుకోండి..
MSME Productvity: రూ.4178 కోట్ల విలువైన పరిశ్రమలకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవం
Gudivada Amarnath: చంద్రబాబు అవినీతి చిట్టా బయటకొస్తోంది: మంత్రి గుడివాడ అమర్నాథ్
