HomeAndhra PradeshAP DSC New Schedule: ఏపీ డీఎస్సీ 2024 షెడ్యూల్‌లో మార్పులు.. మార్చి 20వ తేదీ...

AP DSC New Schedule: ఏపీ డీఎస్సీ 2024 షెడ్యూల్‌లో మార్పులు.. మార్చి 20వ తేదీ నుంచి వెబ్‌ ఆప్షన్లు

AP DSC New Schedule: ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ నియామక పరీక్షలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూల్‌ మార్పు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల కోసం 6100 పోస్టులు భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. టెట్‌కు, డీఎస్సీ పరీక్షకు కనీసం నెల రోజుల గ్యాప్‌ ఉండాలని హైకోర్టు సూచించడంతో ఈ మేరకు ఏపీ విద్యా శాఖ చర్యలు తీసుకుంది. కొత్త షెడ్యూల్‌ను విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ వెల్లడించారు. AP DSC New Schedule

డీఎస్సీ-2024 పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు మంత్రి బొత్స తెలిపారు. డీఎస్సీ-2024 పరీక్ష కోసం ఫిబ్రవరి 25వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించారు. ముందు ప్రకటించిన ప్రకారం ఈ నెల 15వ తేదీ నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల ఈ పరీక్షలను మార్చి 30 వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు.

మొత్తం 14 రోజుల పాటు రెండు సెషన్స్ లలో పరీక్షలను నిర్వహించేలా టైం టేబుల్ ను రూపొందించామని మంత్రి బొత్స తెలిపారు. డీఎస్పీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారు షెడ్యూల్ మార్పును గమనించాలని ఆయన సూచించారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు (ఎస్జీటీ) అర్హతలను మార్చడం, టెట్ పరీక్షకు డీఎస్సీ పరీక్షకు మధ్య తగిన సమయం ఇవ్వడం తదితర కారణాల వల్ల షెడ్యూల్ లో మార్పులు చేయక తప్పలేదని మంత్రి తెలిపారు.

సెంటర్లను ఎంపిక చేసుకోడానికి మార్చి 20 నుంచి వెబ్ ఆప్షన్లు ద్వారా అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. హాల్ టిక్కెట్లను మార్చి 25 వ తేదీ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. కొత్త షెడ్యూల్ ద్వారా లభించిన అవకాశాన్ని పరీక్ష రాసే అభ్యర్థులంతా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మంత్రి కోరారు.

ఇవీ చదవండి: AP DSC 2024: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు.. పూర్తి వివరాలు ఇవీ..
AP DSC Notification: ఏపీలో టీచర్‌ ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. డీఎస్సీ నోటిఫికేషన్‌ రిలీజ్‌.. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులంటే..
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గ్రేట్‌ న్యూస్‌.. 6,100 పోస్టుల భర్తీకి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌
YS Jagan vs All: పిక్చర్‌ క్లియర్‌.. ఒక్క జగన్‌ వర్సెస్‌ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌..!
Army Recruitment Rally: నవంబర్‌లో గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసు పరిధిలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు