HomeInternationalJohn Cena: న్యూడ్‌మెన్‌గా మారిన జాన్‌సెనా.. ఆస్కార్‌ అవార్డుల వేడుకలో స్పెషల్‌ అట్రాక్షన్‌ కోసం తిప్పలు!

John Cena: న్యూడ్‌మెన్‌గా మారిన జాన్‌సెనా.. ఆస్కార్‌ అవార్డుల వేడుకలో స్పెషల్‌ అట్రాక్షన్‌ కోసం తిప్పలు!

John Cena: ప్రముఖ రెజ్లర్‌, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈలో మనకు కనిపించే జాన్‌ సెనా (John Cena) న్యూడ్‌మెన్‌గా మారాడు. ఆస్కార్ అవార్డుల వేడుకలో (Oscars 2024) ఈ వ్యవహారం హాట్‌ టాపిక్‌ అయ్యింది. తద్వారా సోషల్‌ మీడియాలోనూ జాన్‌ సెనా వీడియో వైరల్‌గా మారిపోయింది.

ఈ ఏడాది ఆస్కార్‌ వేడుక (Oscars 2024) ఉత్తమ కాస్ట్యూమ్‌ అవార్డు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ఉన్నట్టుండి ఓ పెద్ద స్టార్‌ నగ్నంగా వేదికపైకి వచ్చి దీని విజేతలను ప్రకటించడం ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఆ హాలీవుడ్‌ హీరో రెజ్లర్‌ జాన్‌ సెనా.

1974లో నిర్వహించిన ఆస్కార్‌ అవార్డుల ప్రదానంలో ఒక వ్యక్తి నగ్నంగా స్టేజ్‌పైకి ఉన్నఫలంగా పరిగెత్తుకొచ్చాడు. అప్పట్లో అది సంచలనం సృష్టించింది. కానీ, 50 ఏళ్ల తర్వాత అచ్చం అలాగే ఈ ఏడు అనౌన్సరే ఏకంగా బట్టల్లేకుండా స్టేజ్‌పైకి వచ్చేయడం విశేషం.

2024 ఆస్కార్‌ వేడుకకు జిమ్మీ కిమ్మెల్‌ యాంకర్‌గా వ్యవహరించారు. ఆయన మాట్లాడుతూ 1974 ఘటనను వివరించారు. ‘‘నాడు డేవిడ్‌ నివ్విన్‌ స్టేజ్‌పైకి ఎలిజిబెత్‌ టేలర్‌ను ఆహ్వానిస్తున్నప్పుడు.. ఓ వ్యక్తి న్యూడ్‌గా స్టేజ్‌పైకి రన్‌ చేశాడు. అదేరకంగా ఈ రోజు కూడా ఎవరైనా న్యూడ్‌మెన్‌ వేదికపైకి వస్తే ఎలా ఉంటుందో చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఇంతలోనే స్టేజ్‌ వెనుక నుంచి జాన్‌ సెనా మాటలు వినపడ్డాయి.

జాన్‌ సెనా మాట్లాడుతూ.. తనకు వేదికపైకి నగ్నంగా రావడం ఇష్టంలేదన్నాడు. మగాడి బాడీ జోక్‌ కాదంటూ కామెంట్‌ చేశాడు. కొద్దిసేపు అతడితో వాదించిన యాంకర్‌ జిమ్మీ.. సరే అవార్డు ఇవ్వు అంటూ ఓ ఎన్వలప్‌ను అతడి చేతిలో పెట్టి స్టేజ్‌ వెనక్కి వెళ్లాడు.

అటు తర్వాత దాన్ని అడ్డు పెట్టుకున్న జాన్‌ సెనా.. అలాగే బుడిబుడి అడుగులు వేసుకుంటూ స్టేజీ పైకి చేరుకున్నాడు. జాన్‌ సెనాను చూసిన గెస్టులందరూ ఫక్కున నవ్వసాగారు. ఆడవాళ్లయితే నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని ముసి ముసి నవ్వులు నవ్వారు. నవ్వుతూ చప్పట్లు కొట్టారు. మైకు ముందుకొచ్చి ఆ ఎన్వలప్‌ను తాను ఓపెన్‌ చేయలేనని జాన్‌ సెనా చెప్పాడు. దీంతో సాయం చేసేందుకు జిమ్మీ అక్కడికి వచ్చి నామినేషన్లను ప్రకటించారు.

https://x.com/ayeejuju/status/1766983440912744959?s=20

ఇలా క్లిప్స్‌ ప్రదర్శిస్తున్నప్పుడు స్టేజ్‌పై లైట్లు ఆఫ్‌ చేశారు. వెంటనే కొందరు హెల్పర్లు అక్కడికి చేరుకుని జాన్‌ సెనాకు బట్టలు తొడిగారు. అనంతరం ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ అవార్డు ప్రకటన చేశారు. ఈ అవార్డు ‘‘పూర్‌ థింగ్స్‌’’ చిత్రానికి దక్కింది. ఈ సారి బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌, ఉత్తమ మేకప్‌ అవార్డులు కూడా ఈ చిత్రానికే రావడం గమనార్హం.

ఇవీ చదవండి: What Is Project K Movie : కల్కి 2898 AD.. ఈసారి హాలివుడ్‌ రేంజ్‌లో ప్రభాస్‌ దుమ్ము రేపుతాడా?
Rashi Singh: రాశి సింగ్‌ హాట్‌ ఫొటో గ్యాలరీ.. భూతద్దం భాస్కర్‌ నారాయణ బ్యూటీ కలర్‌ఫుల్‌ పిక్స్‌!!
Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌ ఫొటో గ్యాలరీ
Palak Tiwari: పాలరాతి శిల్పం.. పాలక్‌ తివారి ఫొటో గ్యాలరీ..
Tamannaah Latest: తమన్నా భాటియా లేటెస్ట్‌ హాట్‌ ఫొటో షూట్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు