CAA: పార్లమెంటు ఎన్నికల తరుణంలో (Lok Sabha Elections) కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం-2019 (CAA)ని అమల్లోకి తెస్తూ నిర్ణయం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇవాళ కేంద్రం జారీ చేసింది. 2019 డిసెంబర్‌లో ప్రతిపక్షాలు దీనిపై తీవ్ర విమర్శలు గుప్పించినప్పటికీ కేంద్రం సీఏఏ చట్టానికి (Citizenship Amendment Act-2019) ఆమోదం తెలిపింది. అనంతరం ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేశారు.
అయితే, పూర్తి నిబంధనలపై సందేహం నెలకొనడంతో ఈ చట్టం ఇప్పటికీ కార్యరూపంలోకి రాలేదు. కేంద్రహోంమంత్రి అమిత్ షా.. ఇటీవలి కాలంలో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందే ఈ చట్టాన్ని అమలు చేస్తామని పలుమార్లు వెల్లడించారు. ఈ నేఫథ్యంలోనే ఇవాళ ఈ నోటిఫికేషన్ జారీ కావడం గమనార్హం.
సీఏఏ చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిం ఏతర శరణార్థుల వద్ద సరైన పత్రాలు లేకపోయినప్పటికీ వారికి సత్వరం పౌర సత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనలను కేంద్రం తయారు చేసింది.
పదేళ్ల కిందట అంటే 2014 డిసెంబర్ 31వ తేదీ కంటే ముందు మూడు దేశాల నుంచి ఇండియాకు వచ్చిన హిందువులు, క్రిష్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధ మతస్తులు, పార్సీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. వీరికి నిబంధనల విషయంలో అంతా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతుంది.
సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ చట్టం నిబంధనలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన తరుణంలో రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. షాహీనాబాగ్, జామియా, ఇతర గొడవలు జరిగేందుకు ఆస్కారమున్న ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భారీగా భద్రత బలగాలను మోహరింపజేశారు. కొందరు పారా మిలటరీ బలగాను సైతం దింపారు. సీఏఏకు గానీ, ఎన్‌ఆర్‌సీకి గానీ వ్యతిరేకంగా ఆందోళనలు చేయడానికి అనుమతులు ఉండవు.
ఇవీ చదవండి: John Cena: న్యూడ్‌మెన్‌గా మారిన జాన్‌సెనా.. ఆస్కార్ అవార్డుల వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ కోసం తిప్పలు!
Court Cases Pending: దేశంలోని కోర్టుల్లో 4.47 కోట్ల కేసులు పెండింగ్.. నేషనల్ జ్యుడీషిల్ డేటాలో కీలక అంశాలు..
Foreign Education: విద్యా విధానం టఫ్‌గా ఉండే దేశాలు ఇవీ.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండోయ్!
Scholarship: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యకు నెలకు రూ.76 వేల స్కాలర్‌షిప్!
World’s Happiest Country: ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశం.. అక్కడి ప్రజల సంతోషానికి కారణం ఏంటో తెలుసా?
