What Is Project K Movie : ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రాజెక్ట్‌పై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ప్రాజెక్ట్ కే అర్థం ఏంటో తెలిసిపోయింది. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే గ్లింప్స్ (Project K Glimpse) విడుదలైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఈసారి హాలీవుడ్ రేంజిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, గ్లింప్స్ విడుదలైంది. యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. (What Is Project K Movie)
సినిమా టైటిల్ (Project K Title)ను అమెరికాలోని శాండియాగో కామిక్ కాన్ 2023 వేదికగా ప్రకటించారు. సినిమా పేరు, వీడియో విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘ప్రాజెక్ట్ కే’ అంటే… ‘కల్కి’ అని పేర్కొన్నారు. కొన్ని రోజులుగా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ప్రభాస్ అభిమానులతో పాటు దేశంలో బాహుబలి ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇందులో భాగంగా కల్కి, కలియుగ్, కాల చక్ర, కురుక్షేత్ర తదితర పేర్లు నెట్టింట చక్కర్లు కొట్టాయి. తాజాగా ఇప్పుడు ‘కే’ అంటే ఏమిటి? అని డౌట్స్ ను పటాపంచలు చేస్తూ ‘ప్రాజెక్ట్ కే’ అంటే ‘కల్కి 2898 ఏడి’ (Project K Means Kalki 2898 AD) అని ప్రకటించారు.
ఇక ‘కల్కి’ గ్లింప్స్ లో ప్రభాస్‌ను ఓ రేంజ్‌లో చూపించారు. సినిమా భారీ అంచనాలతో ఉంటుందని చెప్పేలా హాలీవుడ్ తరహా సీన్లు కనిపించాయి. ఈ వీడియో విడుదల తర్వాత ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.
ప్రపంచాన్ని దుష్టశక్తి ఆవహించినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుందని ‘కల్కి’ గ్లింప్స్‌లో పేర్కొన్నారు. ఆ శక్తిగా ప్రభాస్ ను తెరపై చూపించారు. కథలో టైమ్ ట్రావెల్ గురించి హింట్ ఇవ్వడం ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది. బాలీవుడ్ భామ దీపికా పదుకొనె సీన్లు కూడా ఇందులో ఉన్నాయి.
ప్రాజెక్ట్ కే మూవీ సెట్స్ మీదకు వెళ్లేందుకు ముందు నుంచి ‘ఇదొక పాన్ వరల్డ్ మూవీ’ అంటూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పిన సంగతి తెలిసిందే. మూవీలో ప్రభాస్ లుక్ చూస్తే ఈ విషయాలు నిజమే అంటున్నారు విశ్లేషకులు. సూపర్ హీరో పాత్రను రెబల్ స్టార్ చేస్తున్నారని అభిమానులు అర్థం చేసుకుంటున్నారు. అయితే, ఆ లుక్‌పై సినీ విమర్శలు పెదవి విరుస్తున్నారు.
పూర్తి స్థాయిలో మెప్పించడం లేదని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే, మూవీ విడుదలై మంచి రెస్పాన్స్ వస్తే ఆ విమర్శలే పొగడ్తలుగా మారతాయని అభిమానులు స్పష్టం చేస్తున్నారు.