HomeCinemaFamily Star: ఫ్యామిలీ స్టార్‌ టీజర్‌ రిలీజ్‌.. మృణాల్, విజయ్‌ దేవరకొండ హిట్‌ గ్యారెంటీనా?

Family Star: ఫ్యామిలీ స్టార్‌ టీజర్‌ రిలీజ్‌.. మృణాల్, విజయ్‌ దేవరకొండ హిట్‌ గ్యారెంటీనా?

Family Star: విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. గీతగోవిందం లాంటి సూపర్‌ హిట్‌ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఇంకో సారి దర్శకుడు పరుశురామ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ ‘ఫ్యామిలీ స్టార్’ అని పెట్టారు. దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఫ్యామిలీ స్టార్‌ మూవీలో అందాల భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తోంది. మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ లో మంచి జోష్‌ తెచ్చింది. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. చూపరులను ఆకట్టుకుంటోంది.

గీతగోవిందం సినిమాలో లవ్ స్టోరీతో విజయ్‌ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దర్శకుడు పరుశురాం.. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఒక చిన్న టీజర్ తో మిడిల్ క్లాస్ ఫ్యామిలీల్లో కనిపించే చాలా సన్నివేశాలను చూపించారు. అలా ఒక ఫ్లాష్ లో మొత్తం కనిపించేలా చేశారు.

మధ్య తరగతి యువకుడిగా విజయ్‌ ఈ మూవీలో కనిపిస్తున్నారు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తో పాటు హీరోయిజాన్ని ఎలివేషన్‌ చేసేలా ఈ మూవీలో సీన్లు ఉండబోతున్నాయని ఫిల్మ్‌ సర్కిళ్లలో చర్చ నడుస్తోంది.

సినిమా ఈ టీజర్ సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నామని తొలుత ప్రకటించారు. అయితే సమయానికి పోస్టుపోన్ చేస్తూ రాత్రి 8 గంటలకు అని అనౌన్స్‌ చేశారు. అయితే, 9 గంటలకు టీజర్‌ విడుదల చేశారు. ఇక ఈ ఆలస్యంతో ఫ్యాన్స్ పాటు హీరోయిన్ మృణాల్ కూడా అలిసిపోయింది. విజయ్ ని ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో ట్వీట్‌ కూడా పెట్టడం విశేషం.

‘ఏవండీ.. ఇంకెంతసేపండీ టీజర్’ అంటూ ఎక్స్‌లో ట్వీట్‌ వెలిసింది. ఈ ట్వీట్ చూసిన హీరో విజయ్‌ దేవరకొండ.. బదులిచ్చారు. “సారీ తల్లి, ఒచ్చేస్తుంది. ఇంకొన్ని నిమిషాల్లో టీజర్ అప్లోడ్ అయిపోతుంది. ఈసారి నా గ్యారంటీ” అంటూ రిప్లయ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ టీజర్‌తోపాటు వీరిద్దరి ట్వీట్స్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇవీ చదవండి: Vijay Deverakonda on marriage: పెళ్లయ్యాక నా భార్యతో ఇలా ఉండాలనుకుంటున్నా.. విజయ్‌ దేవరకొండ కామెంట్స్‌
Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌ జోరు.. రెమ్యునరేషన్‌ పెంచేసిందిగా.. వయ్యారి భామ ఫొటో గ్యాలరీ
Romance tips: రొమాన్స్‌లో బెస్ట్‌ టిప్స్.. ఇలా చేస్తే దూసుకెళ్లడం ఖాయం!
Lust Stories 2: మరోసారి తమన్నా బోల్డ్‌ యాక్టింగ్.. లస్ట్‌ స్టోరీస్‌ 2 ట్రైలర్‌లో విజయ్‌ వర్మతో రొమాన్స్‌!
Tamannaah Bhatia: విజయ్‌ వర్మతో అందుకే చనువుగా ఉంటున్నా.. మిల్కీబ్యూటీ తమన్నా బోల్డ్‌ స్టేట్‌మెంట్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు